Congress Khammam Candidate: ఖ‌మ్మం కాంగ్రెస్ అభ్య‌ర్ధిపై వీడిన ఉత్కంఠ‌, పొంగులేటి వియ్యంకుడికే ఖ‌మ్మం సీటు ఖరారు, క‌రీంన‌గ‌ర్, హైద‌రాబాద్ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన కాంగ్రెస్
Congress Flag (Photo-X/Congress)

Hyderabad, April 24: తెలంగాణలో మూడు పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ (Congress). హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి మొహమ్మద్ సమీర్ పోటీ చేయనున్నారు. ఖమ్మం ఎంపీ (Khammam MP) అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి (Raghuram Reddy), కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్ రావు (Rajender Rao) పోటీ చేస్తారు. దీంతో ఆ మూడు స్థానాల్లో పోటీ చేయనున్నది ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్ వేశారు కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు. అధికారికంగా పేరు ప్రకటించకముందే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ల మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు.

 

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఖమ్మం అభ్యర్థిగా సూచించిన రఘురాంరెడ్డి తరఫున కాంగ్రెస్ నేతలు ఇవాళే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు చెందిన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను కాంగ్రెస్ నేతలు దాఖలు చేశారు.  ఇక హైదరాబాద్‌లో ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ నుంచి మాధవీలత పోటీ చేస్తోన్న విషయం విదితమే. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి ముస్లిం అభ్యర్థికే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మొహమ్మద్ సమీర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.