Hyd, December 18: కేటీఆర్ అరెస్టు అయితే పుష్ప -3 లెవెల్ లో మైలేజ్ వస్తుందని అనుకుంటున్నారు అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తరహాలో మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ వేధింపులతో అరెస్టయినప్పుడు ప్రజల సానుభూతి లభించిందన్నారు.
కేసీఆర్ ఇంట్లో రాజకీయంగా ట్రయాంగిల్ ఫైట్ ఉందని...కవిత జైలుకెళ్ళి వచ్చింది, తను కూడా జైలుకు వెళ్లి వస్తే మైలేజ్ పెరుగుతుందని కేటీఆర్ డ్రామాలు చేస్తుండు అని ఆరోపించారు ఎంపీ చామల.
400 సీట్లు వస్తే బీజేపీ రాజ్యాంగాన్నే మార్చేదన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ సభ్యుల నిరసన చెప్పారు. మూసీ సుందరీకరణపై ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్దాలే, డీపీఆర్ రెడీ కాకముందే అప్పు కావాలని ప్రపంచబ్యాంకును కోరిన ప్రభుత్వం...ఎమ్మెల్సీ కవిత ఫైర్
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగానే మార్చేసేదని మండిపడ్డ చామల అవినీతి, అక్రమాలు చేసిన వాళ్లు ఎవరైనా సరే అరెస్టు కాక తప్పదు అని మండిపడ్డారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.
MP Kiran Kumar Reddy On KTR Arrest
కేటీఆర్ అరెస్టు అయితే పుష్ప -3 లెవెల్ లో మైలేజ్ వస్తుందని అనుకుంటున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తరహాలో మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ వేధింపులతో అరెస్టయినప్పుడు ప్రజల సానుభూతి లభించింది
కేసీఆర్ ఇంట్లో రాజకీయంగా ట్రయాంగిల్… pic.twitter.com/yppJ4EZFso
— BIG TV Breaking News (@bigtvtelugu) December 18, 2024
30 వేల ఎకరాల రైతుల భూములు గుంజుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు లగచర్ల గురించి మాట్లాడుతున్నారు... వేల ఎకరాల భూదాన్ భూములు గుంజుకున్న మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు అన్నారు. ప్రజల సొమ్ము గుంజుకొని, దోసుకుంటే ఖచ్చితంగా అరెస్టు కాక తప్పదు అని కేటీఆర్‌పై మండిపడ్డారు అద్దంకి దయాకర్.