Hyderabad, June 13: తెలంగాణలో కరోనా (Telengana Corona) కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి 100కు పైగా కొవిడ్ కేసులు (Covid Cases) వచ్చాయి. క్రమంగా కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్యా (Active Cases)పెరుగుతోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13వేల 254 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 129 మందికి పాజిటివ్ గా(Covid Positive) నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 104 కేసులు వచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో 67 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.12.06.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/uUsu5MaD2N
— IPRDepartment (@IPRTelangana) June 12, 2022
రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1039కి పెరిగింది. నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 94వేల 458 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 89వేల 308 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 15వేల 200 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 145 మందికి పాజిటివ్ గా తేలింది.
కాగా, వందకు పైనే కరోనా కేసులు నమోదవడం ఇది వరుసగా 5వ రోజు. జూన్ 6వ తేదీన 65 కరోనా కేసులు నమోదవగా.. జూన్ 7న 119 కేసులు వచ్చాయి. జూన్ 9న 122 కేసులు, జూన్ 10న 155 కేసులు, జూన్ 11న 145 కేసులు వచ్చాయి.