KTR-DJHS (Credits: X)

Hyderabad, Oct 15: జర్నలిస్టులకు (Journalists) ఇంటి స్థలాల కేటాయింపుల అంశాన్ని మ్యానిఫెస్టోలో పొందుపరచాలని బీఆర్ ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌-DJHS) వినతి పత్రం అందజేసింది. ఈ మేరకు వర్కింగ్ జర్నలిస్టులు, డీజేహెచ్ ఎస్ లో కమిటీ మెంబర్లు అందరూ శనివారం కేటీఆర్ ను కలుసుకున్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలకంగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడి పదేండ్లు కావస్తోంది. కానీ ఇప్పటికీ జర్నలిస్టుల కల నెరవేరలేదు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం సాధించాలన్న లక్ష్యంతోనే డీజేహెచ్‌ఎస్‌ ని ఏర్పాటు చేసినట్టు వారు వివరించారు. కాబట్టి ఇంటి స్థలాలను కేటాయించాలనే ఉద్దేశాన్ని ముఖ్యంగా మ్యానిఫెస్టోలో పెట్టాలంటూ తెలిపారు. మ్యానిఫెస్టోలో ఈ విషయాలను పొందుపరచాలని తెలిపారు.

నెలకు రూ.10 వేల పెన్షన్‌ సౌకర్యం

అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు 300 గజాల ఇంటి స్థలం కేటాయించాలని తెలిపారు. కాబట్టి అధికారంలోకి వచ్చిన నెలలోగా ఈ మేరకు మంత్రి మండలి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రతి జర్నలిస్ట్ ఇల్లు కట్టుకునేందుకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేయాలి, దాంతో పాటు జర్నలిస్టుల్లో ఉన్న అర్హులకు నెలకు రూ.10 వేల పెన్షన్‌ సౌకర్యం అందజేయాలి. దాంతో పాటు జర్నలిస్టుల పిల్లలకు కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందజేయాలిన కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల లాగా జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌ స్కీములు కూడా అందజేయాలని వారు కోరారు. జర్నలిస్టులు కోరిన వాటిని తాము మళ్లీ అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని ప్రకటించారు.