Hyd, Jan 30: హెచ్‌ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అరెస్ట్ అయి అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ(HMDA) వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్‌ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.కాగా ఆదాయనికి మించి ఆస్తుల కేసులో (Disproportionate Assets Case) శివబాలకృష్ణ అరెస్ట్ అయిన సంగతి విదితమే. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
నేడు హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Ex-HMDA Director Shiva Balakrishna) కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు మంగళవారం విచారణ జరిపింది. 10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా, 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. బినామీల విచారణ, ఆస్తులపై దర్యాప్తు చేయాలన్న ఏసీబీ.. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. అధికారులను సైతం ఏసీబీ విచారించనుంది.హెచ్‌ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఆరా తీయనుంది.
Here's suspends Letter
#Hmda #Telangana #Telangana govt suspends #Hmda officers as #Shivabalakrishna for Allegation of possession of assets disproportionate to the known sources of his legal income-Searches conducted by #Anticorruptionbureau #Telangana#Hmda#Rera pic.twitter.com/DO02LzFzlZ
— SHRA.1 JOURNALIST✍ (@shravanreporter) January 30, 2024
పుప్పాలగూడ 447సర్వే నంబర్‌లో అనుమతులపై సూర్య ప్రకాష్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన బాలకృష్ణ అక్రమ ఆస్తులను గుర్తించారు. బాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారిస్తే అక్రమ ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.