Hyderabad, Oct 1: తెలంగాణ జర్నలిస్టులకు (Telangana Journalists) ఇండ్లస్థలాల కోసం డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ (DJHS) నిరంతరాయంగా కృషి చేస్తున్నది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధుల బృందం కలవడం జరిగింది. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వాలని ప్రతినిధులు సీఎస్ ను కోరారు. ఈ విషయంపై శాంతికుమారి స్పందిస్తూ… జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
జర్నలిస్టుల చిరకాల స్వప్నం
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల చిరకాల స్వప్నం సొంతిల్లు, ఈ కలను నిజం చేసే విశాల హృదయం ఈ ప్రభుత్వానికి మాత్రమే ఉందని తాము విశ్వసిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు. సొంతింటి కల ఈ ప్రభుత్వం ద్వారా సాకారమవుతుందని ఆశిస్తున్నామని కోరారు. దీనిపై స్పందించిన సీఎస్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం తనవంతు కృషి చేస్తానని కోరారు. సీఎస్ ను కలిసిన వారిలో అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్, ట్రెజరర్ సిహెచ్ అయ్యప్ప, డైరక్టర్లు దండా రామకృష్ణ, డి కుమార్, సభ్యులు శ్రీలత తదితరులు ఉన్నారు.