Hyderabad, Aug 13: ప్రజల భద్రత కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే, కన్నూమిన్నూ కానకుండా డ్యూటీలో ఉన్న పోలీసులపట్ల (Police) కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ, హోంగార్డుపై కొందరు మహిళలు దాడికి పాల్పడటం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నంబరు 2లోని పార్క్ హయత్ హోటల్ ముందు ఆదివారం రాత్రి ట్రాఫిక్ ఎస్‌ఐ అవినాశ్ బాబు, హోంగార్డు నరేష్ తదితరులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తరువాత 1.15 గంటల ప్రాంతంలో అటుగా వచ్చిన ఓ కారును పోలీసులు ఆపేశారు. కారు నడుపుతున్న మహిళకు నరేష్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిచేందుకు ప్రయత్నించగా ఆమె నిరాకరించడమే కాకుండా నానా బూతులు తిట్టింది.
పాట్నా విమానాశ్రయంలోని రన్ వే పై ముంగిస, పాము మధ్య ఫైట్.. వీడియో వైరల్
జతకూడిన యువకులు
అంతటితో ఆగకుండా హోంగార్డు మొబైల్ ను లాక్కొని నేలకేసి కొట్టింది. ప్రశ్నించేందుకు వచ్చిన ఎస్‌ఐ అవినాశ్‌బాబు ధరించిన బాడీ కెమెరాను సైతం ధ్వంసం చేసింది. ఈమెకు కారులో ఉన్న మరో ముగ్గురు మహిళలు జతచేరారు. ఎస్‌ఐను వెనక్కి తోసేశారు. కొద్ది నిమిషాల్లో మరో వాహనంపై అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులు నరేష్ ను తిట్టి కిందకు నెట్టేశారు. మహిళలు అక్కడినుంచి జారుకోగా పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అందరూ మద్యం తీసుకున్నట్టు సమాచారం.
తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు