Siddipet, Jan 20: తెలంగాణలో (Telangana) ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న దేవాలయం (Drunken Lady Youtuber Hulchul at Komuravelli Mallanna Temple) వద్ద ఆదివారం రాత్రి ఓ లేడీ యూట్యూబర్ తన గ్యాంగ్ తో హల్ చల్ చేసింది. భక్తులపై విరుచుకుపడింది. వివరాల్లోకి వెళ్తే, కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో ప్రస్తుతం జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో కొమురవెల్లి మల్లన్న ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితులను ప్రజలకు తెలియజేసందుకు చాలా మంది మీడియా, యూట్యూబర్లు అక్కడకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో సదరు మహిళా యూట్యూబర్ తన గ్యాంగ్ తో ఆలయం వద్దకు వెళ్లింది. అక్కడ జనం మధ్యలో వీడియో రికార్డు చేస్తుంది.
'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా.. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్
Here's Video:
కొమురవెల్లి మల్లన్న దేవాలయం వద్ద మహిళా యూట్యూబర్ హల్చల్
మద్యంమత్తులో బూతులతో రెచ్చిపోయి దాడికి పాల్పడ్డ మహిళా యూట్యూబర్ గ్యాంగ్ pic.twitter.com/CoS0DpWFVS
— ChotaNews App (@ChotaNewsApp) January 20, 2025
గొడవ ఇలా..
తమ అనుమతి లేకుండా వీడియోలు రికార్డు చేస్తుండటంతో తోటి భక్తులు సదరు మహిళా యూట్యూబర్ అండ్ ఆమె గ్యాంగును నిలదీశారు. దీంతో వారికి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఫలితంగా యూట్యూబర్ తో వచ్చిన గ్యాంగ్ ఆలయం వద్ద వీరంగం సృష్టించారు. చొక్కాలు చిరిగేలా అక్కడ తోపులాట, కోట్లాట జరిగినట్లు వీడియో విజువల్స్ ను పరిశీలిస్తే తెలుస్తోంది. సదరు మహిళా యూట్యూబర్ అండ్ ఆమె గ్యాంగు తాగినట్టు భక్తులు ఆరోపిస్తున్నారు.