Hyderabad, Mar 23: వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా నిర్వహిస్తున్న ‘ఎర్త్ అవర్’ను (Earth Hour 2024) వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) నేడు నిర్వహించనున్నది. ఇందులో భాగంగా మార్చి 23 రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ పాటించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఎర్త్ అవర్ 2024 సందర్భంగా ఆ సమయంలో, ప్రజలు, సంస్థలు ఒక గంట పాటు లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఆపివేయమని కోరింది. హైదరాబాద్ వాసులూ నేడు ఎర్త్ అవర్ ను పాటించనున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007లో సింబాలిక్ లైట్స్ అవుట్ అనే ఈవెంట్ ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి 190కి పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ఫాలో అవుతూ.. గ్లోబల్ ఉద్యమంగా మారింది.
హైదరాబాద్‌లో 'ఎర్త్ అవర్'.. గంట పాటు చీకట్లోకి నగరం, ప్రముఖ కట్టడాలు.. ఎందుకలా..?#Hyderabad #EarthHour #EarthHour2024 #delhi #Telanganahttps://t.co/KVuATQiieu
— Samayam Telugu (@SamayamTelugu) March 23, 2024
చీకట్లో కట్టడాలు
హైదరాబాద్‌లోనూ ఈ కార్యక్రమాన్ని అనుసరిస్తోంది. ‘ఎర్త్ అవర్’ సందర్భంగా నగరంలోని ఐకానిక్ భవనాలన్నీ చీకటిగా మారనున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ రాష్ట్ర సచివాలయం, దుర్గం లేక్ కేబుల్ వంతెన, హుస్సేన్ సాగర్ వద్ద బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, చార్మినార్… అంధకారంలో మునిగిపోనున్నాయి. ఈ భవనాల్లోని లైట్లను గంటపాటు స్విచ్ ఆఫ్ చేసి ఎర్త్ అవర్ లో పాల్గొంటారు.