Motkupalli Joins TRS Party: మోత్కుపల్లితో నా స్నేహం రాజ‌కీయాల‌కు అతీతం, ప్రాణం పోయినా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని వదలమన్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు
Ex Minister Motkupalli Narasimhulu joining in TRS Party (Photo-Video Grab)

Hyderabad, Oct 18: న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో (Motkupalli Joins TRS Party) చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్.. మోత్కుప‌ల్లి న‌ర్సింహులు (Ex Minister Motkupalli Narasimhulu) టీఆర్ఎస్ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌కు మోత్కుప‌ల్లి ధ‌న్య‌వాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులు TRS పార్టీలో చేరిన సందర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM KCR) ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

ఈ స‌మాజానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. ప్ర‌జా జీవితంలో ఆయ‌నకంటూ ఒక స్థానం ఉంది. విద్యార్థి ద‌శ త‌ర్వాత క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ‌లందించ‌డ‌మే కాకుండా అణ‌గారిన ప్ర‌జల వాయిస్‌గా ఉన్నారు. త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. త‌న‌కు అత్యంత సన్నిహిత మిత్రులు. నాతో అనేక సంవ‌త్స‌రాలు క‌లిసి ప‌ని చేశారు. వారి వెంట ఎంతో అభిమానంతో వ‌చ్చిన వారంద‌రికీ హృద‌య‌పూర్వ‌క‌మైన స్వాగ‌తం తెలుపుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ స‌మాజం అత్యంత దారుణ‌మైన ప‌రిస్థితుల‌ను అనుభ‌వించింది. చాలా బాధ‌లు ప‌డ్డాం. చాలా అనుభ‌వించాం. ఒక‌ప్పుడు న‌ర్సింహులు క‌రెంట్ మంత్రిగా ఉండే. నేను ఆయ‌న‌ను క‌లిసిన‌ప్పుడు క‌రెంట్ బాధ‌లు ఉన్నాయ‌ని చెప్పిండు. ఆలేరు అంతా క‌రువు ప్రాంతం. ఎన్ని ట్రాన్స్‌ఫార్మ‌ర్లు తీసుకొచ్చినా లాభం లేకుండా పోయింది అని ఆవేద‌న వ్య‌క్తం చేసిండు. క‌రెంట్ కోసం తెలంగాణ ప్రాంతం ఎన్నో క‌ష్టాలు ప‌డ్డ‌ది. ఆ త‌ర్వాత సోష‌ల్ వెల్ఫేర్ మినిస్ట‌ర్‌గా సేవలందించారు.

మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎంపిక లాంఛనమే, ఆయన పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన టీఆర్ఎస్ మంత్రులు, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని స్పష్టం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి

ఒకానొక ద‌శ‌లో తెలంగాణ స‌మాజం చెదిరిపోయింది. ఒక విచిత్ర‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది. నేను మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఓ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ‌కు పెట్టుబ‌డులు రావు అని అన్నాడు. అప్పుడు నేను గొడ‌వ‌ప‌డ్డాను. తెలంగాణ వ‌స్తే ఏం అభివృద్ధి జ‌ర‌గ‌ద‌ని చిత్రీక‌రించారు. అనేక అవ‌మానాల‌ను తెలంగాణ స‌మాజం ఎదుర్కొన్న‌ది. తెలంగాణ ఉద్య‌మం మొద‌లుపెట్టిన త‌ర్వాత కూడా అనేక భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు. ఆలేరు, భువ‌న‌గిరి, జ‌న‌గామ వ‌ద్ద మంచినీళ్ల వ్యాపారం మొద‌లుపెట్టారు. చాలా భ‌యంక‌ర‌మైన ప‌రిస్థితి. మంచినీల్లు రావు, క‌రెంట్ స‌మ‌స్య‌.. ఆ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు.

ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌కు రాజ‌కీయాలు అంటే ఒక గేమ్.. కానీ టీఆర్ఎస్‌కు అట్ల కాదు. టీఆర్ఎస్‌కు ఇది ఒక టాస్క్‌.. ఒక య‌జ్ఞం. ప‌ట్టువ‌ట్టి ప‌ని చేయాలి అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.న‌ర్సింహులు రాజ‌కీయాల కోసం టీఆర్ఎస్ పార్టీలో చేర‌లేదు. మోత్కుప‌ల్లికి క‌రోనా వ‌చ్చిన‌ప్పుడు కోటి ఖ‌ర్చు అయినా ప‌ర్లేదు.. ఆయ‌న‌కు మంచి వైద్యం అందించాల‌ని చెప్పాను. మేమిద్దరం మంచి స్నేహితులం. మోత్కుప‌ల్లితో నా స్నేహం రాజ‌కీయాల‌కు అతీతం. ద‌ళిత‌బంధు భేటీల‌కు మోత్కుప‌ల్లి హాజ‌ర‌య్యారు. ద‌ళిత బంధు ప‌థ‌కానికి (Dalit Bandhu) తోడ‌వుతాన‌ని మోత్కుప‌ల్లి త‌న‌తో అన్నారు.

శ్రీశైలం, సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక కృష్ణా బోర్డు పరిధిలోకే, మాకు ఒకే అన్న ఏపీ, జల విద్యుత్ కేంద్రాలు అప్పగించబోమని స్పష్టం చేసిన తెలంగాణ,ఈ నెల 14 నుంచి గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమల్లోకి రావడంపై సందిగ్ధత

ద‌ళిత బంధుతో బ‌ల‌హీన వ‌ర్గాల‌ను బ‌లోపేతం చేసే య‌జ్ఞం ఇక్క‌డితో ఆగ‌దు. గిరిజ‌నులు, బీసీలు, ఈబీసీల్లో కూడా వ‌స్త‌ది. వ‌చ్చిన ఆదాయాన్ని ప్ర‌జ‌ల‌కు ఏదో రూపంలో పంచుతాం. అతి ఎక్కువ బాధ‌లో, దుఃఖంలో ఉన్న ప్ర‌జ‌ల‌కు ముందు మేలు చేస్తాం. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు వంద శాతం ఆదుకోవాలి. అప్పుడే గొప్ప‌ద‌నం ఉంటుంది. ద‌ళిత బంధుకు రూ. ల‌క్షా 70 వేల‌ కోట్లు ఖ‌ర్చు పెట్టాల‌ని నిర్ణ‌యించాం. ఈ కార్య‌క్ర‌మాన్ని ఇక్క‌డితో ఆపం. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అమ‌లు చేస్తాం. ద‌ళిత బంధు ద్వారా రాష్ట్రానికి రూ. 10 ల‌క్ష‌ల కోట్ల ఆదాయం వ‌స్తుంద‌న్నారు. భార‌త ద‌ళిత స‌మాజానికి తెలంగాణ ద‌ళిత స‌మాజం దిక్సూచి కావాలి. క‌ర్ణాట‌క‌లోని రాయ్‌చూర్ ప్ర‌జ‌లు కూడా తెలంగాణలో క‌లుస్తామ‌ని అంటున్నారు. తెలంగాణ ప‌థ‌కాలు ఇతర రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి అని సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితేనే ఇక్క‌డి ప్ర‌జ‌లు బాగుప‌డుతార‌ని భావించి స్వ‌రాష్ట్ర ఉద్య‌మం మొద‌లుపెట్టాను. ఆ స‌మ‌యంలో ఎన్నో అన్నారు. ఎన్నో తిట్లు తిట్టారు. ముక్కు బాలేద‌ని ఎవ‌డికీ తోచింది వారు తిట్టారు. దేవుడు, ప్ర‌జ‌లు మ‌న్నించారు. మొత్తానికి తెలంగాణ సాధించుకున్నాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంద‌రం పోరాడి దేశ రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని మార్చాం. మాయావ‌తి ఇంటికి 19 సార్లు పోయాము. మాయావ‌తి త‌న‌ను ఎంతో అభిమానించేది. మాయావ‌తి తెలంగాణ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇచ్చారు. అలా ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టాం. తెలంగాణ సాధ‌న‌లో అనేక అటుపోట్లు ఎదుర్కొన్నాం. తెలంగాణ వ‌చ్చిన‌ప్పుడు విప‌త్క‌ర‌మైన ప‌రిస్థితులు ఉండే. అనేక‌మైన బాధలు.. మంచి నీళ్లకు, క‌రెంట్‌కు ఇబ్బంది ఉండే. వ్య‌వ‌సాయంలో దుర్భ‌ర ప‌రిస్థితి. మొత్తానికి కింద‌మీద ప‌డి, అన్ని అర్థం చేసుకుని ప‌రిపాల‌న ప్రారంభించుకున్నాం.

ఇప్పుడు గ్రామాల్లో అన్ని ర‌కాల అభివృద్ధి జ‌రుగుతోంది. ఎవ‌రి బ‌తుకు వారు బ‌తుకుతున్నారు. హైద‌రాబాద్‌లో ఉన్నోళ్లు గ్రామాల‌కు వెళ్లి బ‌తుకుతున్నారు. ఇంకా చాలా జ‌ర‌గాల్సి ఉంది. వెనుక‌బ‌డ్డ ప్ర‌జ‌లు, అన్యాయానికి గురైన ప్ర‌జ‌ల‌కు న్యాయం చేకూర్చాలి. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గిపోయాయి. చేనేత కార్మికులు బాగుప‌డుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ‌లో స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌స్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు అద్భుతంగా అమ‌ల‌వుతున్నాయి. ఏ ప‌ని చేసిన అర్థం ప‌రమార్థం ఉంటుంది అని సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రాణం పోయినా వ‌ద‌లం అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ‌లో అతిపెద్ద కులం ద‌ళిత కులం. 75 ల‌క్ష‌ల మంది జ‌నాభా ద‌ళితులు ఉన్నారు. అంద‌రీ క‌న్నా త‌క్కువ భూమి ద‌ళితుల వ‌ద్ద ఉంది. 13 ల‌క్ష‌ల ఎక‌రాల భూమి మాత్ర‌మే ద‌ళితుల వ‌ద్ద‌ ఉంది. 9 శాతం మంది ఉన్న గిరిజ‌నుల వ‌ద్ద 22 ల‌క్ష‌ల ఎక‌రాల భూమి వ‌ద్ద ఉంది. ద‌ళితుల వ‌ద్ద 13 ల‌క్ష‌ల ఎక‌రాల భూమి కూడా ఉందో లేదో తెలియ‌దు. లెక్క తీస్తే తెలుస్త‌ది. ద‌ళితుల‌ను బ‌తుక‌నివ్వ‌లేదు. జ‌నాభా ఎక్కువ ఉన్న‌ది. అవ‌కాశాలు త‌క్కువ ఉన్నాయి.

అంబేద్క‌ర్ పుణ్య‌మా అని ఎస్సీల‌కు రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు అందాయి. అంబేద్క‌ర్ పుణ్యంతో కొంత‌మంది పిల్ల‌లు చదువుకుని ఉన్న‌త ఉద్యోగాలు పొందారు. కొంద‌రు ఎమ్మెల్యేలు అయ్యారు. అట్ట‌డుగు స్థాయిలో ఉన్న వారి కోసం అంబేద్క‌ర్ పోరాటం చేశారు. తెలంగాణ తేవడం ఎంత పెద్ద య‌జ్ఞ‌మో.. ద‌ళిత బంధును విజ‌య‌వంతం చేయ‌డం అంతే పెద్ద య‌జ్ఞం అని అన్నాఉరు. ప్రాణం పోయినా ద‌ళిత బంధును వ‌ద‌లం. సంవ‌త్స‌రానికి కొంత మందికి అమ‌లు చేస్తాం. ఈ ఏడాది ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి వంద మందికి క‌చ్చితంగా ఈ ప‌థ‌కం అమ‌లు చేస్తాం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది. ఈ ఏడేండ్ల‌లో తెలంగాణ పెట్ట‌బోయే ఖ‌ర్చు రూ. 23 ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్ ఉటుంది. వ‌చ్చే ఏడేండ్ల‌లో రూ. 1.7 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం పెద్ద విష‌యం కాదు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఇక్క‌డితో ఆపాం. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అమ‌లు చేస్తాం. ద‌ళిత బంధు ద్వారా రాష్ట్రానికి రూ. 10 ల‌క్ష‌ల కోట్ల ఆదాయం వ‌స్తుంద‌న్నారు. భార‌త ద‌ళిత స‌మాజానికి తెలంగాణ ద‌ళిత స‌మాజం దిక్సూచి కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.