Hyd, oct 20: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద జరిగిన ఆందోళన పై స్పందించారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ముత్యాలమ్మ విగ్రహాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి దుర్ఘటనలు చాలా బాధాకరం అని...బస్తీ వాసులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తామని చెప్పారు. ఆలయ పరిసర ప్రాంతాలలో పోలీస్ పికెటింగ్ మూలంగా ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు. ఎగువ నుంచి ప్రవాహం.. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తివేత.. వీకెండ్ కావడంతో సందడిగా పరిసరాలు
Here's Video:
సికింద్రాబాద్.. ముత్యాలమ్మ ఆలయం వద్ద జరిగిన ఆందోళన పై స్పందించిన మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
👉ముత్యాలమ్మ విగ్రహ విధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి
👉ఇలాంటి దుర్ఘటనలు చాలా బాధాకరం.
👉బస్తీ వాసులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత… pic.twitter.com/SbF0jcnEeD
— Telangana Awaaz (@telanganaawaaz) October 20, 2024
రాజకీయాలకు అతీతంగా ఆలయ విధ్వంసం పై ప్రతి ఒక్కరు కలిసి రావాలని కోరిన తలసాని...ఉత్తర మండలంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి భయంకర సంఘటనను చూడలేదని ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని అన్నారు..