Balapur Laddu Auction (Credits: X)

Hyderabad, Sep 17: హైదరాబాద్ (Hyderabad) లో గణేశ్ నిమజ్జనం (Ganesh Nimajjanam) వైభవంగా జరుగుతున్నది. ఇప్పుడు బాలాపూర్‌ లడ్డూపైనే అందరి దృష్టి పడింది. ఎందుకంటే, గణేష్‌ లడ్డూల్లో బాలాపూర్‌ లడ్డూ ప్రత్యేకతే వేరు. ప్రతి ఏటా రికార్డు ధర పలుకుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ బాలాపూర్‌ లడ్డూ. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే గణనాథుడి లడ్డూ వేలం పాటలో ఈ ఏడాది రూ. 30.01 లక్షలకు కొలను శంకర్ రెడ్డి  దక్కించుకున్నారు.

Ganesh Nimajjanam-Khairatabad Ganesh Shobhayatra: కన్నులపండువగా ఖైరతాబాద్‌ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర.. లైవ్ వీడియో కోసం క్లిక్ చెయ్యండి..!

రికార్డుల పరంపర

1994లో కేవలం 450 రూపాయలు పలికిన బాలాపూర్‌ లడ్డూ.. గతేడాది 27లక్షలకు చేరింది. బాలాపూర్‌ లడ్డూ వేలానికి 30ఏళ్ల చరిత్ర ఉంది. బాలాపూర్‌ లడ్డూ రికార్డు ధర పలకడమే కాదు.. దాన్ని దక్కించుకున్నవారికి కొంగు బంగారంగా నిలుస్తోంది. 1994 నుంచి 2001 వరకు వేలల్లో మాత్రమే పలికిన లడ్డూ ధర.. 2002 నుంచి లక్షల్లోకి చేరింది. ఎప్పటికప్పుడు తన రికార్డులనే తానే బ్రేక్‌ చేసుకుంటూ గతేడాది 27లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ ఈ ఏడాది 30 లక్షలు దాటింది.