Hyderabad, Sep 8: హైదరాబాద్ (Hyderabad)లోని దిల్ సుఖ్ నగర్ పీఎన్టీ కాలనీలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ కాలనీలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి కూడా అదే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకొన్నారు. అందరికంటే వినూత్నంగా ఉండాలని కొత్తగా పత్తి (Cotton)తో డెకరేషన్ చేశారు. అంతా పూర్తయింది అనుకునే లోపు మెయిన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఒక్కసారిగా షాక్ సర్క్యూట్ అయి విద్యుత్ ఘాతుకానికి (Fire Accident) కాలి బూడిద అయిపోయింది.
Here's Video and Photos:
గణేష్ మండపం వద్ద అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
దిల్సుఖ్నగర్ P.N.T కాలనీలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి అదే విధంగా నిర్వహించే క్రమంలో కొత్తగా పత్తి (Cotton)తో డెకరేషన్ చేశారు. అంతా పూర్తయింది అనుకునే లోపు మెయిన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే… pic.twitter.com/E2pd4wMxpV
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2024
తృటిలో తప్పిన పెనుముప్పు
అగ్నిప్రమాద ఘటనకు ఐదు నిమిషాల ముందు మండపం వద్ద చిన్నారులు సందడి చేసి అప్పుడే తమ ఇండ్లళ్లకు వెళ్ళారు. అలా వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేసరికి ఇలా జరిగిపోయింది. దీంతో మండపం వద్ద చిన్నారులంతా కన్నీరుమున్నీరయ్యారు. అయితే, దైవానుగ్రహం ఉండడం వల్ల ఏ ఒక్కరికి కూడా చిన్న గాయం కాలేదని స్థానికులు చెబుతున్నారు.