Hyderabad, Aug 21: తెలంగాణలో (Telangana) అప్పుడే పొలిటికల్ హీట్ (Political Heat) పెరిగింది. పార్టీల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. వచ్చే డిసెంబర్ లోపు ఎన్నికలు జరగాల్సి ఉండటంతో అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీలు తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మరికొద్దిసేపట్లో తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసీఆర్ ఇప్పటికే లిస్టును సిద్ధం చేశారని సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి మరోసారి అవకాశం ఇవ్వబోతున్నట్లుగా నేతలు చెబుతున్నారు. శ్రావణ సోమవారం, పంచమి రోజు కావడంతో 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది.
BRS First Phase Of Assembly Candidates List Release | Today | అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలుhttps://t.co/OWZVUbyhNQ pic.twitter.com/8WEK1ETV6r
— ETVTelangana (@etvtelangana) August 21, 2023
10 మంది దాకా సిట్టింగ్‌లకు..
జాబితాలో ఓ 10 మంది దాకా సిట్టింగ్‌లకు సీట్లు దక్కలేదని తెలుస్తోంది. టికెట్లు దక్కని సిట్టింగులకు, ఇతర ఆశావహులకు ఇప్పటికే బుజ్జగింపులు కూడా పూర్తి చేసినట్లు ప్రచారం సాగుతోంది.