
Sangareddy, Jan 7: సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఘోరం జరిగింది. కోహీర్ లో నిర్మాణంలో ఉన్న చర్చి శ్లాబ్ (Church slab collapsed) కుప్పకూలింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ నిర్మాణ కూలీలు నలుగురు చనిపోయారు. మరో నలుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
