Free Coaching For SC,ST Students: విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, పూర్తి వివరాలు మీకోసం..
Representational Image (Photo Credits: PTI)

విదేశీ యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ డెవలప్‌మెంట్ కమిషనర్ యోగితా రాణా తెలిపారు. విదేశాల్లో చదవాలనుకునే వారికి టోపెల్‌, ఐఈఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ, జీమ్యాట్‌ తదితర పరీక్షలకు హాజరయ్యేందుకు ఉచితంగా కోచింగ్‌ ఇస్తామని చెప్పారు.

ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు అలర్ట్, ఆగస్టు 3 నుంచి 12 వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, విడుదలైన ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇక్కడి సుచిత్రా క్రాస్‌రోడ్‌ సమీపంలోని స్టెప్‌-ఇన్‌ లీడ్స్‌ అకాడమీలో ఉచిత కోచింగ్‌, సూచనలు అందించనున్నట్లు యోగితా రాణా తెలిపారు. డిగ్రీలు పూర్తి చేసి విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీలు చేయాలనుకునే తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని రానా సూచించారు. అభ్యర్థులు వెంకటేశ్వర ఎన్‌క్లేవ్ భవన్ రెండవ అంతస్తులో ఉన్న స్టెపిన్ లీడ్స్ అకాడమీని సందర్శించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం, వారు మేనేజింగ్ డైరెక్టర్ వంగూరి బ్రహ్మయ్యను ఫోన్ నంబర్ 9030463377లో సంప్రదించవచ్చు.