Free Electricity to Farmers Row: మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా?, తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇదంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్
Telangana IT Minister KTR (PIC @ FB)

రైతులకు మూడు గంటల కరెంట్‌ ఇస్తే సరిపోతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్‌ అవసరం లేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ నోట రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యిందని పేర్కొన్నారు.

రేవంత్‌రెడ్డిని పొలిమేర దాకా తరిమికొట్టండి, ఉచిత కరెంట్ మీద ఎందుకు అంత కడుపుమంటని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్‌ వస్తే నిన్న ధరణి తీసేస్తామని అన్నడు రాబందు.. నేడు 3 గంటల కరెంట్‌ చాలు అంటున్నాడని అని సీరియస్‌ అయ్యారు. కేసీఆర్‌ నినాదం మూడు పంటలు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ విధానం మూడు గంటలు.. బీజేపీ విధానం మతం పేరిట మంటలు అని పేర్కొన్నారు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అని పేర్కొన్నారు.

Here's Tweets

నాడు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నాడని.. నేడు చోటా చంద్రబాబు వ్యవసాయానికి మూడు పూటల కరెంట్‌ దండగ అంటున్నాడని కేటీఆర్‌ మండిపడ్డారు. మూడెకరాల రైతుకు మూడు పూటల కరెంట్‌ ఎందుకు అనడం.. ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమే అని స్పష్టం చేశారు. నోట్లు తప్ప.. రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టి కొట్టుడు ఖాయమని వ్యాఖ్యానించారు.