Hyderabad, Sep 21: హైదరాబాద్ (Hyderabad) లో భారీ వర్షం (Heavy Rains) కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఉప్పల్ నుంచి లింగంపల్లి, అటు పాతబస్తీ నుంచి ఇటు కొంపల్లి వరకూ పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా నిన్న కురిసిన వర్షానికి ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, బాలానగర్, జీడిమెట్ల, నాంపల్లి, హిమాయత్ నగర్,ఆర్టీసీ క్రాస్ రోడ్, తార్నాక, కోఠి,సరూర్‌నగర్, రామంతాపూర్ తదితర ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌ లో దంచి కొట్టిన వర్షం, ఉరుములు-మెరుపులతో పలు చోట్ల భారీ వర్షం, రహదారులు జలమయం..వీడియోలు ఇదిగో

నేడు, రేపూ ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం పలుచోట్ల ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

తెలంగాణ‌లో రాబోయే మూడు రోజుల పాటూ వ‌ర్షాలు, ప‌లు జిల్లాల‌కు ఐఎండీ అల‌ర్ట్, ఏయే ప్రాంతాల్లో వాన‌లు ప‌డుతాయంటే?