Rainfall -Representational Image | (Photo-ANI)

Hyderabad, July 12: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం (Hyderabad Rains) కురిసింది. మియాపూర్, నిజాం పేట్, ప్రగతి నగర్‌, కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్ ప్రాంతాల్లో కుండపోత వర్షం (Heavy Rains) పడింది. ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేటలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నెమ్మెదిగా కదులుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వరకు పొడి గా ఉన్న వాతావరణం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పూర్తి చల్లబడింది. ఆ తర్వాత నగరంలో అక్కడక్కడ చిరు జల్లులతో మొదలైన వర్షం రాత్రి 9 గంటల తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.

Telangana Shocker: వీడియో ఇదిగో, భార్య తిట్టిందని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన 

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బాలానగర్ , బేగంపేట్ సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ. నాచారం, ఎ.ఎస్‌రావు నగర్, కుషాయిగూడ, ఉప్పల్, నాగోల్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, చార్మినార్, చంద్రాయణ్‌గుట్ట, నాంపల్లి, లక్డికాపూల్, మెహిదిపట్నం, లంగర్ హౌజ్, రాజేంద్రనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం(Hyderabad Rains) కురిసింది.  ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడడంతో వర్షంలోన తడిసి ముద్దయ్యారు. వర్షం నేపథ్యంలో జిహెచ్‌ఎంసి అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ సహాయక బృందాలను మోహరించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో ఎప్పటీకప్పుడు పర్యవేక్షిస్తున్న ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మరోవైపు డిఆర్‌ఎఫ్ బృందాలు సైతం సహాయక చర్యలో నిమగ్నమైయ్యాయి.

రాష్ట్రంలో రాగల ఐదు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే (Rain Alert) అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, ములుగు, కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండలో భారీ వానలు పడుతాయని చెప్పింది.

గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని పేర్కొన్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వానలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.