Exam. Representative Image. (Photo Credits: Pixabay)

Hyderabad, AUG 28: రేపు  తెలంగాణ రాష్ట్రంలో జరిగే యూనిఫాం సర్వీసుల్లో కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షకు టీఎస్ఎల్‌పీఆర్‌బీ (TSLPRB) ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 16,321 కానిస్టేబుల్ పోస్టుల (Constable post) కోసం ఏకంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారిగా భారీ ఎత్తున కానిస్టేబుళ్ల నియామకాల కోసం పరీక్ష (Exam) జరుగుతోంది. పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం 1,601 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 10గంటల వరకు తప్పనిసరిగా చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. ఇదిలాఉంటే పరీక్షకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు www.tslprb.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్‌ ఐడి, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Ban on Plastic Flexis in AP: 2027 నాటికి ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌గా ఏపీ, ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం 

హాల్ టికెట్ ను (Hall ticket) ఏ4 సైజ్ పేపర్ లో ప్రింట్ తీసుకొని దానిపై నిర్ధేశిత స్థానంలో దరఖాస్తు సమయంలో డిజిటల్ కాపీలో ఉంచిన ఫొటోనే తిరిగి అతికించాలి. కేవలం గమ్ తోనే అతికించాలి. అభ్యర్థులు చేతులకు మెహిందీ, టాటూలు ఉంచుకోవద్దు. మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదు. ఓఎంఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మత సంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్ క్టీస్ గా పరిగణిస్తారు. అభ్యర్థి పరీక్ష గదిలోకి హాల్ టికెట్ తో పాటు బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నును మాత్రమే తీసుకెళ్లాలి.

Hyderabad Shocker: హోం వర్క్ చేయలేదని స్టూడెంట్‌ని మోకాళ్లపై నిల్చోబెట్టిన టీచర్, తోటి విద్యార్థుల ముందు అవమానం జరిగిందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని 

ఈసారి రాత పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీసారి కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షల్లో ఎస్సీ (SC), ఎస్టీలకు (ST) 30 శాతం, బీసీలు (BC) 35శాతం ఇతరులు 40శాతం కనీస మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణించేవారు. కానీ, ఈ సారిమాత్రం అలాంటివేమీ లేకుండా అన్నివర్గాల వారికి 30శాతం కనీస మార్కులనే అర్హతగా పరిణించనున్నారు. ఈసారి ఈ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ టైప్ లో 200 ప్రశ్నలుంటాయి. వీటిలో 60 మార్కులు వస్తే సరిపోతుంది