Human Trafficking Case: హైదరాబాద్‌లో బలవంతపు వ్యభిచారం, 12 మందిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ, నలుగురు బంగ్లాదేశ్ యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Human Trafficking (Photo Credits: Pixabay|Representational Image)

Hyderabad, Oct 18: వ్యభిచారం కోసం సరిహద్దు మీదుగా బాలికలను అక్రమ రవాణాకు (Human Trafficking Case) పాల్పడినందుకు తొమ్మిది మంది బంగ్లాదేశ్ పౌరులతో సహా 12 మందిపై ఎన్ఐఏ చార్జిషీట్ (NIA Chargesheets 12 Including 9 Bangladeshi) దాఖలు చేసింది. హైదరాబాద్‌లోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులో శనివారం ఐపీసీ, అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం, విదేశీయుల చట్టం సెక్షన్ల కింద చార్జిషీట్ దాఖలైంది. ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో అభియోగ పత్రాలను దాఖలు చేసింది. కాగా బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు యువతులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేయగా వీరిలో తొమ్మిది మంది బంగ్లాదేశీయులు, మిగతావారు స్థానికులుగా ఎన్‌ఐఏ (National Investigation Agency) గుర్తించింది. నకిలీ ఇండియన్‌ ఐడీ కార్డు సృష్టించి బంగ్లాదేశ్‌ నుంచి యువకులను అక్రమంగా తరలించి.. గృహాల్లో బందించి బలవంతంగా వ్యభిచారం చేయించిన నిందితులపై తాజాగా ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ తరలించి వ్యభిచార గృహాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది.

బడా బాబుల నీలి స్కాం, వెలుగులోకి కొత్త విషయాలు, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న లిప్ స్టిక్, కళ్లద్దాల గేమ్, దేశంలో అతి పెద్ద సెక్స్ కుంభకోణం ఇదే

పశ్చిమ బెంగాల్‌కు చెందిన రుహుల్ అమిన్ ధాలి, అసహద్ హసన్, మహారాష్ట్రకు చెందిన షరీఫుల్ షేక్‌లతో పాటు బంగ్లాదేశ్ పౌరులు - మొహద్ యూసుఫ్ ఖాన్, బీతి బేగం, మొహద్ రానా హుస్సేన్, మహ్మద్ అల్ మామున్, సోజిబ్ షేక్, సురేష్ కుమార్ దాస్, మొహద్ అబ్దుల్లా అయూబ్ షేక్, పరారీలో ఉన్న నిందితుడు అబ్దుల్ బారిక్ షేక్ వారిని ఎన్ఏఐ గుర్తించింది.

సోన్‌ నది దాటించి కలకత్తా మీదుగా ముంబాయి, హైదరాబాద్ తరలించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. వారిని గృహాల్లో బందించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు అభియోగాలు మోపింది. తొలుత నగరంలోని పహడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళల అక్రమ రవాణాపై కేసు నమోదు కాగా, ఆ తరువాత ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. జల్పల్లి ప్రాంతంలో వ్యభిచార గృహాల్లో ఉన్న నలుగురు బంగ్లా యువతులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారు ప్రస్తుతం హైదరాబాద్ షెల్టర్ హోమ్స్‌లో ఉంచారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎన్‌ఐఏ పేర్కొంది. కాగా ఉమెన్‌ ట్రాఫికింగ్‌ అప్పట్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే.

కువైట్‌లో అమ్మకానికి 200 మంది ఆంధ్ర అమ్మాయిలు, సంచలనం రేపుతున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్

మరో కేసులో ధాలిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. సరిహద్దుల్లో అక్రమ రవాణాకు ధాలికి కమీషన్ చెల్లించినందున ధాలి, షేక్‌ల మధ్య డబ్బు బదిలీలు జరిగాయని తదుపరి దర్యాప్తులో తేలిందని అధికారి తెలిపారు. 1980 లలో ధాలి మరియు అరెస్టయిన మరో 10 మంది నిందితులు భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి, భార్యాభర్తలుగా ఉన్న యూసుఫ్, బీతిలతో కలిసి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యభిచార రాకెట్‌ను ఏర్పాటు చేసినట్లు ఎన్‌ఐఏ ప్రతినిధి తెలిపారు. అరెస్టు చేసిన నిందితులు హైదరాబాద్‌లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.