Hyd, August 4: దోపిడీకి పాల్పడి గతంలో ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద జైలుకెళ్లిన హిస్టరీ షీటర్ కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అతను ఆన్ లైన్ ద్వారా గే ఛాటింగ్ చేసి వారితో పరిచయం పెంచుకుని రూం రమ్మన్న తరువాత వారి బట్టలు విప్పమని బలవంతం చేశాడని, నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు చిత్రీకరించాడని, ఆపై కత్తిని చూపుతూ దోచుకున్నాడని బాధితులు ఆరోపించారు.ఈ ఘటనపై మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 23 ఏళ్ల ఇంజనీర్ బుధవారం మధ్యాహ్నం పోలీసులను ఆశ్రయించాడు.
బంజారహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్–12 ప్రాంతానికి చెందిన యువకుడు(23) ఈ నెల 1న తన గే లకు సంబంధించి గ్లెండర్ యాప్‌లో చాటింగ్ చేస్తుండగా అవతలి వైపు నుంచి అఫ్రిది అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కాసేపు చాటింగ్ చేసుకున్న తరువాత తన గదికి రావాలంటూ ఆఫ్రిది లొకేషన్ పంపాడు. దీంతో సదరు యువకుడు ఆఫ్రిది గదికి వెళ్లగా కత్తి చూపించి న్యూడ్ వీడియోలు, ఫొటోలు తీశాడు.
అర్థరాత్రి బంజారాహిల్స్‌లో కారు బీభత్సం, ఆడి కారుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలును ఢీకొట్టిన కారు
బలవంతంగా అతడి చేతికి ఉన్న బ్రాస్లెట్‌తో పాటు గొలుసు, రూ. 2వేల నగదు, డెబిట్, క్రెడిట్ కార్డులు లాక్కున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అతడి భారి నుంచి తప్పించుకుని బయటపడిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ఆఫ్రిదిని రౌడీషీటర్‌గా గుర్తించారు.
నిందితుడు ఆఫ్రిది ఇదే తరహాలో మరో యువకుడిని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 భోళానగర్‌లోని తన గదికి రప్పించాడు. అనంతరం కత్తితో బెదిరించి దుస్తులు విప్పించి నగ్న దృశ్యాలు వీడియో తీయించాడు. వీడియోలు ఎందుకు తీస్తున్నావంటూ నిలదీయగా అతడిపై దాడి చేయడమే కాకుండా తన స్నేహితుడు హరున్‌తో కలిసి దాడి చేసి రూ. 7వేల నగదు, బంగారు ఉంగరం లాక్కున్నాడు. ఫోన్ పే ద్వారా రూ. 20 వేలు మహ్మద్ ఉమర్ మొయినుద్దీన్ ఖాతాకు బదిలీ చేయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.