Representational Image (File Photo)

Hyd, April 23: కూకట్‌పల్లి వైజంక్షన్‌లోని ఓ భవనం సెల్లారులోని షట్టరు ముందు ఆదివారం తెల్లవారుజామున చిత్తు కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని మహిళ(45)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి పరారైన ఘటన తెలిసిందే. రక్తస్రావంతో బాధితురాలు ఘటనా స్థలంలోనే మృతిచెందింది. ఈ కేసును పోలీసుల చేధించారు. ఈ అమానుషానికి పాల్పడిన యువకులు సంగారెడ్డికి చెందిన వారుగా విచారణలో తేలింది. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని గుర్తించి దర్యాప్తు చేపట్టడంతో ఆచూకీ లభించింది.  ఢిల్లీలో 9 ఏళ్ళ బాలికపై తెగబడిన కామాంధులు, దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య, ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం

వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. ఆ యువకులు సంగారెడ్డిలోనే ఉన్న ఓ బార్‌లో పనిచేస్తారని తేలింది. బార్‌లో అర్ధరాత్రి వరకు పనిచేసిన వారు బాగా మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వైజంక్షన్‌ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో అటుగా నడుచుకుంటూ వచ్చిన బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. ఆమె మూసాపేటలో ఉండేదని, ఆరు నెలల క్రితం వరకు ఓ వాహన షోరూంలో స్వీపర్‌గా పని చేసేదని తెలిసింది. అక్కడ సిబ్బందిని విచారించినా ఆమె చిరునామా తెలియలేదు. పోలీసా..లేక కామాంధుడా, ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై పలుమార్లు అత్యాచారం, గుజరాత్‌లో దారుణ ఘటన, కర్ణాటకలో మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చిన మహిళపై లైంగిక దాడికి పాల్పడిన మరో కానిస్టేబుల్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లోని విష్ణుప్రియ లాడ్జి సమీపంలోని ఏఆర్‌ పైపు వర్క్స సెల్లార్‌లో ఓ మహిళ మృతదేహం ఉందనే సమాచారం అందటంతో కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ కృష్ణమోహన్‌లు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్లారు.ఆదివారం తెల్లవారుజామున సుమారు 4.30– 5 గంటల మధ్య వైన్‌ షాపు వద్ద రోడ్డుపై ఓ మహిళ మూసాపేటకు వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ఆమెను ఒకరు చేతులు, మరొకరు కాళ్లు పట్టుకొని బలవంతంగా పక్కనే ఉన్న ఏఆర్‌ పైపువర్కు సెల్లార్‌లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తిరిగి అదే బైక్‌పై కూకట్‌పల్లి వైపు వెళ్లినట్లుగా పోలీసులు సీసీ ఫుటేజీలో గమనించారు. అక్కడ ఉన్న సెల్లార్‌ చాలా లోతుగా ఉండటంతో రోడ్డుపై నుంచి చూసినా ఎవరికీ కనిపించదు.

ప్రాణాలు కోల్పోయిన మహిళ వయసు 42 నుంచి 48 ఏళ్ల మధ్య ఉంటుందని, తీవ్ర రక్తస్రావం కావటంతో ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మూసాపేటలో ఎక్కువగా సంచరించే ఓ మహిళ.. విష్ణుప్రియ లాడ్జి సమీపంలోని బైక్‌ షోరూంలో 2019 నుంచి స్వీపర్‌గా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటలకు పని చేస్తోంది. ఆమెకు మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో పక్కనే ఉన్న వైన్‌షాపులో మద్యం తాగి రాత్రి వరకు అక్కడే ఉండి మూసాపేటలోని చిత్తారమ్మ ఆలయం పరిసర ప్రాంతంలో నిద్రించేదని స్థానికులు పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామున కూడా రోడ్డుపై వెళుతుండగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.