తెలంగాణ ప్రభుత్వం నగరంలో రెండో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా, త్వరలో రెండు వాణిజ్య విమానాశ్రయాలు ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ చేరే అవకాశం ఉంది. హకీంపేట్‌లోని డిఫెన్స్ ఎయిర్‌పోర్టును పౌర విమానయానం కోసం ఉపయోగించేందుకు అనుమతించాలని కేంద్రాన్ని అభ్యర్థించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయంపై త్వరలోనే రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి నిర్ణయం తీసుకోబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హకీంపేట్ ఎయిర్ బేస్ స్టేషన్ పూణే, గోవా తరహాలో హైబ్రిడ్ మోడల్‌లో పనిచేయగలదని, ఇక్కడ విమానాశ్రయం, రక్షణ, పౌర విమానయానానికి ఉపయోగించవచ్చని కల్వకుంట్ల రామారావు పేర్కొన్నారు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి
ప్రస్తుతం హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏటా 2.5 కోట్ల మంది ప్రయాణికుల అవసరాలను తీరుస్తోందని. నగరం వేగంగా అభివృద్ధి చెందడంతో, రెండవ విమానాశ్రయం అవసరమని మంత్రివర్గం భావించింది.
భారతదేశంలో, ఢిల్లీ నగరం కూడా రెండు విమానాశ్రయాలను కలిగి ఉంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కాకుండా, మరొక వాణిజ్య విమానాశ్రయం కూడా ఉంది. భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రమైన గోవాలో కూడా రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. ఒకటి ఉత్తర గోవాలో మరొకటి దక్షిణ గోవాలో ఉన్నాయి. అవి దబోలిమ్ విమానాశ్రయం, మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం కావడం విశేషం.