Hyderabad, April 06: హైదరాబాద్ బోరబండకు (Borabanda) చెందిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్ (Tempo driver) ఉదంతం మిస్టరీగా మారింది. గోవా (Goa)వెళ్లిన తనకు ఎవరో మత్తుమందు ఇచ్చి తన శరీరంలోని అవయవాలు (Organs theft) దొంగిలించారంటూ డ్రైవర్ శ్రీనివాస్ చెప్పడం సంచలనంగా మారింది. తలకు,పొట్ట భాగంలో కుట్లతో మంగళవారం హైదరాబాద్ నిమ్స్ (NIIMS) ఆసుపత్రిలో చేరిన శ్రీనివాస్ ను పరీక్షించిన వైద్యులు అతని శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నట్లు తేల్చారు. అయితే మరి శరీరంపై ఉన్న కుట్లు ఏమిటనే విషయం మాత్రం మిస్టరీగా ఉండిపోయింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధి బోరబండలో నివాసముంటున్న శ్రీనివాస్..టెంపో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మార్చి 19న 10 మందిని గోవా తీసుకువెళ్లిన శ్రీనివాస్ 20న సాయంత్రం అదృశ్యమయ్యాడు. దీంతో కూడా వచ్చిన ప్రయాణికులు బోరబండలోని శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకుని గోవా వెళ్లిన కుటుంబ సభ్యులు అక్కడ శ్రీనివాస్ కోసం గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో గోవాలోని అంజునా పోలీస్ స్టేషన్(Anjuna Police Station) లో ఫిర్యాదు చేశారు.

Crime: భారీ నిత్యపెళ్లికొడుకు అరెస్టు, 75 మంది యువతులతో వివాహం, అమ్మాయిలను వ్యభిచార కూపంలో తొయ్యడమే అసలు వృత్తి..

ఇంతలో తనంతట తానే ఇంటికి చేరుకున్న శ్రీనివాస్..తలకు, పొట్ట భాగంలో కుట్లు ఉన్నాయి. గోవాలో ఎవరైనా శ్రీనివాస్ పై మత్తు ప్రయోగం చేసి శరీర అవయవాలు తీసుకున్నారని కుటుంబ సభ్యులు అనుమానించారు. ఆసుపత్రిలో చేరేందుకు కూడా కుటుంబ ఆర్ధిక పరిస్థితి సహకరించకపోవడంతో మిన్నకుండిపోయారు. అయితే ఇంతలో గోవాలో ఉన్న ప్రయాణికులు..శ్రీనివాస్ కు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో టెంపో యజమానికి సమాచారం ఇచ్చారు. గోవా చేరుకుని ప్రయాణికులను తీసుకువచ్చిన టెంపో యజమాని..ఈ విషయమై నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ (Baba Fasiyuddin) సహాయంతో బాధితులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు పిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. శ్రీనివాస్ ను నిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. శ్రీనివాస్ ను పరీక్షించిన వైద్యులు అతని శరీర అవయవాలు బాగానే ఉన్నాయని, ప్రాణానికి ప్రమాదం ఏమి లేదని తేల్చారు.

PubG Crime: PubGకి బానిసై కుటుంబ సభ్యులనే కడతేర్చిన బాలుడు, మృతుల్లో తల్లి, సోదరుడు, అక్కా చెళ్లెల్లు

గోవాలో శ్రీనివాస్ ఏదైనా ప్రమాదానికి గురై ఉంటాడని..స్థానికులెవరైనా ఆసుపత్రికి తరలించగా అక్కడ కుట్లు వేసి ఉండొచ్చని పరీక్షలు చేసిన నిమ్స్ ఎమర్జెన్సీ విభాగం వైద్యులు అంటున్నారు. ఎవరో మత్తు మందు ఇచ్చి అతని అవయవాలు తీసుకున్నట్లు తొలుత అనుమానించిన కుటుంబ సభ్యులు..శ్రీనివాస్ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని నిమ్స్ వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే గోవా నుంచి తిరిగి వచ్చిన డ్రైవర్ శ్రీనివాస్ అక్కడ ఏం జరిగిందనే విషయంపై స్పష్టత లేకున్నాడు. శ్రీనివాస్ పూర్తిగా కోలుకుంటే అసలు విషయం తెలిసే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.