Hyderabad Road Accident: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, తెలంగాణ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూతురు దుర్మరణం
Accident Representative image (Image: File Pic)

Hyd, August 1: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, లైలా ఖాన్ దంపతుల కుమార్తె తనియా కక్డే దుర్మరణం చెందారు. ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తనియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫిరోజ్ ఖాన్, ఇతర కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు.

తనియా కక్డే శంషాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డుపై తన స్నేహితుడితో కలిసి I-20 కారులో వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొట్టి ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె అక్కడికక్కడే మరణించిందని, కారులోని మిగిలిన ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

250 గజాల భూమి కోసం గొడవ.. మాదాపూర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య, మీడియాకి వివరాలను వెల్లడించిన డీసీపీ సందీప్‌రావు

తానియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.