Gun Fire at Madhapur (Photo-Video Grab)

Hyd, August 1: భాగ్యనగరంలోని మాదాపూర్‌లో తెల్లవారుజామున కాల్పులు (Gun Fire at Madhapur) కలకలం సృష్టించాయి. నిరూస్‌ సర్కిల్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో ఇస్మాయిల్‌ అనే వ్యక్తిని ముజీబ్‌ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ముజీబ్‌ బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇస్మాయిల్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికు తరలించారు. ఈ ఘటనలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇస్మాయిల్‌ మృతి చెందగా, జహంగీర్‌కు తీవ్ర గాయలయ్యాయి. ఇస్మాయిల్‌పై పాయింట్‌ బ్లాంక్‌లో రౌడీషీటర్‌ మహ్మద్‌ కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్‌, జహంగీర్‌, మహ్మద్‌ మధ్య రియల్‌ ఎస్టేట్‌ వివాదమే కాల్పులకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో మొత్తం ఐదుగురు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇస్మాయిల్‌, ముజీబ్‌ సహా మిగతా వారంతా పాతబస్తీకి చెందినవారిగా గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్‌ టీం ఆధారాలు సేకరిస్తున్నది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాడ్‌బండ్‌లోని 250 గజాల భూమి విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఈ భూమిని కొన్నాళ్ల క్రితమే మహ్మద్ పేరుపై రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారి ఇస్మాయిల్ గిఫ్ట్ డీడ్ చేశాడు. వివాద పరిష్కారం కోసం ఇస్మాయిల్‌ను మహ్మద్(Mohammad) మాదాపూర్‌కు పిలిచాడు. ఇస్మాయిల్, మహ్మద్ మాట్లాడుతుండగా జిలానీ(Jilani) కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్‌పై కంట్రిమేడ్ వెపన్‌(Country made weapon)తో 6 రౌండ్ల కాల్పులు జరిపాడు.

బాబాయి చెవి ఊడేలా కొరికిన అబ్బాయ్! కుటుంబ తగాదాల్లో విచక్షణారహితంగా దాడి, చెవి కొరకడంతో సగం ఊడి వచ్చిన చెవి, సగం చెవితో ఆస్పత్రికి పరుగులు పెట్టిన వ్యక్తి

ఘటనలో ఇస్మాయిల్‌ మృతి చెందగా.. అతనితో పాటు ఉన్న జహంగీర్‌కు గాయాలయ్యాయి. మహ్మద్‌కు జిలానీ రైట్ హ్యాండ్‌గా ఉన్నాడని తెలుస్తోంది. ఈ ఘటనపై జహంగీర్ మాట్లాడుతూ.. ‘‘మహ్మద్-ఇస్మాయిల్ మధ్య భూ వివాదం ఉంది. నిన్న రాత్రి మహ్మద్ కాల్ చేశాడు. మాదాపూర్‌కు నేను, ఇస్మాయిల్, అక్బర్ వెళ్లాం. మహ్మద్, ఇస్మాయిల్ కలిసి చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇస్మాయిల్‌పై ఒక్కసారిగా ఫైర్ ఓపెన్ చేశారు. అడ్డుకునేందుకు వెళ్తే నాపై జిలానీ కాల్పులు జరిపాడు’’ అని వెల్లడించాడు.

మాదాపూర్ కాల్పుల ఘటనపై డీసీపీ సందీప్‌రావు(DCP Sandeeprao)మీడియా సమావేశం(Media meeting)లో మాట్లాడుతూ.. ఇస్మాయిల్‌తో ముజాహిద్దీన్‌ మాట్లాడుతుండగా కాల్పులు జరిపారు. ఇస్మాయిల్‌, ముజాహిద్దీన్‌ మధ్య ల్యాండ్‌ వివాదం ఉందన్నారు. డీసీపీ మాట్లాడుతూ.. ‘‘కంట్రీమేడ్‌ వెపన్‌(Country made weapon)తో కాల్పులు జరిపారు. సంగారెడ్డి(Sangareddy)లో ఇస్మాయిల్‌, ముజాహిద్దీన్‌ కలిసి రియల్‌ ఎస్టేట్‌(Real Estate) చేస్తున్నారు. జిలానీ మొదట ఫైరింగ్‌ చేశాడు. జిలానీపై గతంలో కేసులు ఉన్నాయి. ఇస్మాయిల్‌ వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు’’ అని పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.