Representative image. (Photo Credits: Unsplash)

Hyd, June 13: హైదరాబాద్ లో బాచుపల్లిలో నారాయణ కాలేజీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాలికల క్యాంపస్‌ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం హాస్టల్‌ భవనం 5వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని వంశిక అనే విద్యార్థిని మృతి చెందింది. వంశిక ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నట్లు గుర్తించారు. కాగా కామారెడ్డి జిల్లాకు చెందిన వంశిక వారం రోజుల క్రితమే క్యాంపస్‌లో చేరినట్లు తెలిసింది.

బాత్రూమ్‌లో కలిసి స్నానం చేస్తూ యువ జంట దుర్మరణం.. గీజర్ లోంచి గ్యాస్ లీక్‌ కావడంతో స్పృహ తప్పి పడిపోయిన వైనం, కొద్దిసేపటికే దుర్మరణం.. బెంగళూరులో ఘటన

సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌ వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వంశిక ఆత్మహత్య చేసుకుందా? ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిందా? అన్నది స్పష్టత లేదు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.