HYDRA Limits: హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు.. కూల్చివేతలపై సీఎస్ శాంతికుమారి కీలక ప్రకటన
హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
Hyderabad, Aug 30: హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా (HYDRA Limits) వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే, హైడ్రా పరిధి ఎంత మేరకు ఉన్నదంటూ పలు వర్గాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఈ విషయానికి సంబంధించి తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు ఉంటుందని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిని సీఎం శాంతికుమారి ప్రకటించారు. ఇక నుంచి నోటీసుల జారీ, తొలగింపు చర్యలు అన్నీ ఒకే విభాగంగా ఉండాలని, అవన్నీ హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నట్లు ఆమె తెలిపారు.
అలా ఇబ్బంది రాకుండా ఉండేందుకే?
ఆక్రమణల తొలగింపునకు నీటిపారుదల శాఖ, జీహెచ్‌ఎంసీ, పురపాలక, పంచాయతీరాజ్.. ఇలా వేర్వేరు విభాగాలు నోటీసులు జారీ చేస్తుండడంతో సమస్యలు ఎదురవుతున్నాయని శాంతికుమారి గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో భాగంగానే అన్నీ అనుమతులు హైడ్రాకు ఇవ్వాలని యోచిస్తున్నట్టు వివరించారు. హైడ్రాకు అదనపు సిబ్బందిని కేటాయిస్తామని వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Aug 30, 2024 10:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

