Rains (Photo-Twitter)

Hyderabad, SEP 29: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) పడతాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈశాన్య ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం  ఏర్పడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించిందని తెలిపింది. తూర్పు-పశ్చిమ షియర్‌ జోన్‌ సుమారుగా 15N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 -4.5 కి.మీ మధ్య స్థిరంగా కొనసాగుతుందని వెల్లడించింది.

Andhra Pradesh: విశాఖలో విషాదం, తల్లిదండ్రులు గొడవలు చూడలేక కూతురు ఆత్మహత్య, నా అంత్యక్రియలకు డబ్బులు ఖర్చు చేయవద్దని, అవయువాలు దానం చేయాలని సూసైడ్ నోట్ 

దీంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నాలుగు రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీచేసింది.