Heavy Rains (Photo-Twitter)

Hyderabad, AUG 05: తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ(IMD). రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavey rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం (Low pressure) ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.  ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజగిరి, మహబూబాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఎల్లో అలెర్ట్‌ను (Yellow alert) జారీ చేసింది.

శుక్రవారం కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహమబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ నెల 6న రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ (Orange alert) చేసింది. నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

Telangana: ఏం జరిగినా క్షణాల్లోనే పోలీసులకు.. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకతలు ఇవే  

అటు ముఖ్యంగా ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైద‌రాబాద్‌తో (Greater Hyderabad) పాటు రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మూడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీచేశారు. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గురువారం గ్రేటర్‌లోని పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది