హైదరాబాద్, ఫిబ్రవరి 13 : శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భగవద్రామానుజాచార్యుల 120 కిలోల సువర్ణమూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌జీ ఆవిష్కరించారు. సమతాక్షేత్రం భద్రవేదిలోని ఫస్ట్‌ఫ్లోర్‌లో భగవద్రామానుజాచార్యుల సువర్ణమూర్తిని లోకార్పణ చేశారు రామ్‌నాథ్‌కోవింద్‌జీ. స్వర్ణమూర్తికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన సతీమణి భారత ప్రథమ మహిళ సవితా కోవింద్ తొలిపూజ చేశారు. స్వర్ణమూర్తికి రాష్ట్రపతి కుటుంబసభ్యులు హారతి ఇచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ దంపతులు , ఆయన కూతురు స్వాతి కోవింద్‌కు 120 కేజీల సువర్ణమూర్తి విశిష్టతలను వివరించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ. అనంతరం బంగారు శఠగోపంతో రాష్ట్రపతి కుటుంబసభ్యులను ఆశీర్వదించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌జీ కుటంబసభ్యులతో కలిసి 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. సమతాక్షేత్రంలోని 108 దివ్యదేశాలను సందర్శించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ దివ్యక్షేత్రాల విశిష్టతలను, సమతాక్షేత్ర స్ఫూర్తి కేంద్రం విశేషాలను రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి దంపతులకు రామానుజాచార్యుల ప్రతిమను బహూకరించి సత్కరించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు .
President Ram Nath Kovind graced Sri Ramanuja Sahasrabdi Samaroham and unveiled the gold statue of Sri Ramanujacharyaji in Hyderabad.
Details: https://t.co/kchauIIkZw pic.twitter.com/ZSszNCZETR
— President of India (@rashtrapatibhvn) February 13, 2022
శ్రీభగవద్రామానుజాచార్యుల 120 కిలోల స్వర్ణమూర్తిని లోకావిష్కరణ చేయడం తన అదృష్టమన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌జీ. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు శ్రీభగవద్రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఆదిశేషుడే కలియుగంలో రామానుజాచార్యులుగా జన్మించారన్నారు రాష్ట్రపతి. భగవంతుడిని ప్రార్థించడానికి అందరికీ అర్హత ఉందని రామానుజాచార్యులు వెయ్యేళ్లక్రితమే చెప్పారన్నారు. భక్తి మనసును భట్టి ఉంటుంది కానీ కులాన్ని బట్టి ఉండదని చాటిచెప్పారన్నారు రాష్ట్రపతి. కులాలతో సంబంధం లేకుండా భక్తితోనే ముక్తి లభిస్తుందని ఉపదేశించారన్నారు. పీడిత వర్గాల కోసం రామానుజా చార్యులు వైష్ణవ ఆలయాల ద్వారాలు తెరిచారన్నారు. రామానుజాచార్యుల శిష్యుల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారే ఉన్నారన్నారు. రామానుజాచార్యులు భక్తితో భారతీయులను ఏకతాటిపైకి తెచ్చిన మహనీయులన్నారు. సమతామూర్తి విగ్రహ ఏర్పాటు స్ఫూర్తితో లోక కల్యాణం కోసం కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు రామ్‌నాథ్ కోవింద్.
216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం లోకార్పణ చేయడంతో దేశంలో నవశకం ప్రారంభమైందన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. తెలంగాణలో కొత్త సాంస్కృతిక జీవనం మొదలైందన్నారు. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విలసిల్లుతుందన్నారు. 108 దివ్యదేశ ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ చేయడందో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోందన్నారు రాష్ట్రపతి. దక్షిణభారత భక్తి సంప్రదాయాన్ని దేశం మొత్తానికి పరిచయం చేసింది శ్రీభగవద్రామానుజాచార్యులేనన్నారు . భారత్ వసుధైక కుటుంబం అనేభావన కల్పించింది శ్రీభగద్రామానుజాచార్యులేనన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌జీ. అంబేద్కర్, గాంధీజీ, స్వామీ వివేకానంద రామానుజాచార్యుల స్ఫూర్తితోనే సమాజంలో అసమానతలపై పోరాడారన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. అంబేద్కర్‌కు రామానుజాచార్యుల బోధనలే స్ఫూర్తినిచ్చాయన్నారు. రాజ్యాంగంలో అంటరానితనం నిషేధం, సమానత్వం అంశాలను చేర్చేందుకు రామానుజాచార్యుల బోధనలే స్ఫూర్తినిచ్చాయన్నారు. మహారాష్ట్రలోని అంబేద్కర్ స్వస్థలం తరహాలోనే శ్రీరామనగరంలో సమానత్వం వెల్లువిరుస్తుందన్నారు రాష్ట్రపతి. రామనుజాచార్యుల చరిత్ర చదివాకే గాంధీజీ పోరాటం మొదలైందన్నారు. గాందీజీపై రామానుజాచార్యుల బోధనల ప్రభావం ఉందన్నారు రామ్‌నాథ్ కోవింద్.
వెయ్యేళ్ల క్రితమే కుల వివక్షను పారదోలేందుకు శ్రీభగద్రామానుజాచార్యులు కృషిచేశారన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌జీ కుటుంబసమేతంగా విచ్చేసి రామానుజాచార్యుల సువర్ణమూర్తిని ఆవిష్కరించి.. లోకార్ఫణ చేయడం ఆనందంగా ఉందన్నారు. కులాలకు అతీతంగా భక్తులు ఇచ్చిన విరాళాలతో రామానుజాచార్యుల భారీ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు చిన్నజీయర్ స్వామీజీ. రామ్‌నాథ్ కోవింద్‌జీ రాష్ట్రపతిగా కొనసాగుతున్న సమయంలో కాశీ పునరుద్ధరణ జరిగిందని.. అయోధ్యలో రామ మందిరం నిర్మాణమవుతోందన్నారు.
అంతకుముందు శ్రీరామనగరం చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్, శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు స్వాగతం పలికారు. సమతా క్షేత్రంలో రాష్ట్రపతికి పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు.
216 అడుగుల సమతామూర్తిని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ దర్శించుకున్నారు. రాష్ట్రపతి ఆవిష్కరించిన120 కేజీల సువర్ణమూర్తిని దర్శించుకున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించారు. నేత్ర విద్యాలయ విద్యార్థులు రూపొందించిన అంధులు ఉపయోగించే ప్రత్యేకమైన వాయిస్ స్టిక్‌ను ఆవిష్కరించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్.
216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠించిన శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్. కులం కన్నా గుణం గొప్పదని రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే ప్రబోదించారన్నారు. నరుల సేవే నారాయణ సేవగా రామానుజాచార్యులు భావించారు. రామానుజాచార్యుల భారీ విగ్రహ సమానత్వానికి ప్రతిరూపకంగా నిలుస్తోందన్నారు. రామానుజాచార్యుల బోధనలు యువతకు, భవిష్యత్ తరాలకు ప్రేరణ కలిగిస్తాయన్నారు.