Inter Advanced Supplementary Exams: తెలంగాణ ఇంట‌ర్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌, మే 24 నుంచి ప‌రీక్ష‌లు, పూర్తి టైం టేబుల్ ఇదుగోండి
Representative Image (Photo Credit: PTI)

Hyderabad, April 27: ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ (Inter Advanced Supplementary) ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. మే 24వ తేదీ నుంచి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు ఇంట‌ర్ సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు (Inter Advanced Supplementary) నిర్వ‌హించ‌నున్నారు. ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్ జూన్ 4 నుంచి 8వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఫ‌స్టియ‌ర్ స్టూడెంట్స్‌కు ఇంగ్లీష్ ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్ జూన్ 10న ఉద‌యం 9 గంట‌ల‌కు నిర్వ‌హించ‌నున్నారు. జూన్ 11న ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేష‌న్ ఎగ్జామ్, 12న ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ఎథిక్స్ అండ్ హ్యుమ‌న్ వాల్యూస్ ఎగ్జామ్ నిర్వ‌హించ‌నున్నారు.

JEE Advanced Applications Today: నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ దరఖాస్తులు.. మే 7 వరకు తుది గడువు.. మే 26న పరీక్ష 

ఫ‌స్టియ‌ర్ టైం టేబుల్

మే 24 – సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్ -1

మే 25 – ఇంగ్లీష్ పేప‌ర్ -1

మే 28 – మ్యాథ్స్ పేప‌ర్ 1ఏ, బోట‌ని పేప‌ర్ -1, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ -1

మే 29 – మ్యాథ్స్ పేప‌ర్ 1బీ, జువాల‌జీ పేప‌ర్ -1, హిస్ట‌రీ పేప‌ర్ -1

మే 30 – ఫిజిక్స్ పేప‌ర్ -1, ఎకాన‌మిక్స్ పేప‌ర్ -1

మే 31 – కెమిస్ట్రీ పేప‌ర్ -1, కామ‌ర్స్ పేప‌ర్ -1

జూన్ 1 – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్ -1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్ -1

జూన్ 3 – మోడ్ర‌న్ లాంగ్వేజ్ పేప‌ర్ -1, జియోగ్ర‌ఫీ పేప‌ర్ -1

సెకండియ‌ర్ టైం టేబుల్

మే 24 – సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్ -2

మే 25 – ఇంగ్లీష్ పేప‌ర్ -2

మే 28 – మ్యాథ్స్ పేప‌ర్ 2ఏ, బోట‌ని పేప‌ర్ -2, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ -2

మే 29 – మ్యాథ్స్ పేప‌ర్ 2బీ, జువాల‌జీ పేప‌ర్ -2, హిస్ట‌రీ పేప‌ర్ -2

మే 30 – ఫిజిక్స్ పేప‌ర్ -2, ఎకాన‌మిక్స్ పేప‌ర్ -2

మే 31 – కెమిస్ట్రీ పేప‌ర్ -2, కామ‌ర్స్ పేప‌ర్ -2

జూన్ 1 – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్ -2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్ -2

జూన్ 3 – మోడ్ర‌న్ లాంగ్వేజ్ పేప‌ర్ -2, జియోగ్ర‌ఫీ పేప‌ర్ -2