Hyderabad, Jan 15: సంక్రాంతి (Pongal) పండుగ వేళ రెండు కుటుంబాల్లో విషాదం (Tragedy) అలుముకున్నది. వ్యాపారులు అమ్మొద్దని, ప్రజలు వాడొద్దని నిషేధించిన చైనా మాంజా (China Manja) మెడకు చుట్టుకొని ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. పతంగి ఎగరేస్తూ ఏఎస్సై కుమారుడు భవనంపై నుంచి పడి చనిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని విశాఖకు చెందిన కోటేశ్వర్‌రెడ్డి (29) ఆర్మీలో పనిచేస్తూ 20 రోజుల క్రితం బదిలీపై హైదరాబాద్ కు వచ్చాడు. అత్తాపూర్ సమీపంలోని నలందనగర్ లో తన భార్య, రెండేండ్ల కూతురుతో కలిసి నివాసముంటూ లంగర్ హౌస్ లోని గోల్కొండ మిలటరీ దవాఖానలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, అకస్మాత్తుగా గొంతుకు చైనా మాంజా తగిలి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆయనను ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు.
#Pongal2024 China Manja killed Army employee Koteshwar rao! Incident happened at LangarHouse FlyOver
చైనా మాంజా తగిలి ఇండియన్ ఆర్మీ లో పని చేసే కోటేశ్వేర్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి..
లంగర్ హౌజ్ ఫ్లై ఓవర్ పై ప్రమాదం..#Lohri2024 pic.twitter.com/kiRCkf084r
— keshaboina sridhar (@keshaboinasri) January 14, 2024
గాలిపటం ఎగరవేస్తూ భవనంపై నుంచి కింద పడి ఏఎస్ఐ కొడుకు మృతి https://t.co/YzMYra6syT
— V6 News (@V6News) January 14, 2024
పండుగ పూట విషాదం.. మాంజా మెడకు చుట్టుకుని సైనికుడు, భవనంపై నుంచి పడి ASI కుమారుడు మృతి#kite #sankranti #Hyderabad #soldier #Telanganahttps://t.co/isP5rIoiuu
— Samayam Telugu (@SamayamTelugu) January 14, 2024
పతంగి కోసం..
ఇక, అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న రాజశేఖర్ చిన్న కుమారుడు ఆకాశ్ (20) అల్వాల్ లోని లయోల కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కొంపల్లిలోని ఎన్ సీఎల్ కాలనీలో గ్యాస్ గెడ్ గ్రీన్స్ అపార్ట్ మెంట్‌లో ఐదో అంతస్థు భవనంపై నుంచి ఆదివారం మధ్యాహ్నం అపార్ట్ మెంట్‌వాసులతో కలిసి పతంగి ఎగురవేస్తున్నాడు. ఈ క్రమంలో పతంగి కింద చిక్కుకున్నది. ఆ పతంగిని బయటకు తీసేందుకు భవనంపై నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ కాలుజారీ కిందపడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించగా అప్పటికే ఆకాశ్ చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.