Hyderabad, June 21: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. త్వరలోనే కొత్త పెన్షన్లతో (new pensions) పాటు రేషన్‌కార్డులు (ration Cards) జారీ చేయనున్నుట్లు ప్రకటించారు. నగర పరిధిలో కైతలాపూర్ ఫ్లై ఓవర్‌ను (kaithlapur Flyover)ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు మంచినీటి సదుపాయం, రోడ్లు, కరెంటు, పార్కులు, వైకుంఠధామాలు బాగు చేసుకున్నామని, బస్తీల్లో ఉండే పేదలకు సుస్తీ అయితే.. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అన్నపూర్ల సెంటర్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇప్పుడు ‘మన బస్తీ – మన బడి’ (mana basthi-mana badi) కార్యక్రమంలో పాఠశాలలు బాగు చేసుకుంటున్నామని, ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లు కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యే కృష్ణారెడ్డి 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పామని.. వెంటనే ఇవ్వాలని కోరారన్నారు.
Live: MA&UD Minister @KTRTRS speaking after inaugurating Kaithalapur Road over Bridge (RoB) at Kukatpally in Hyderabad https://t.co/TXaPZQPKXb
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 21, 2022
అతి త్వరలోనే పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ‘మీ శాసనసభ్యుడు, కార్పొరేట్ల చేతుల మీదుగా.. మీరు ఎక్కడ తిరిగే అవసరం లేకుండా.. ఎవరి చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ బస్తీమే.. మీ కార్పొరేటరే వచ్చి.. ఎవరు ఎవరు అర్హులున్నారో ఒక్కరూ మిస్ కాకుండా ఇచ్చే బాధ్యత మాది. ఈ విషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాక ముందు ఈ రాష్ట్రంలో 29లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది. రూ.200, రూ.500 పెన్షన్ వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 40లక్షల మందికి పెన్షన్లు వస్తున్నయ్. రూ.200 పెన్షన్ పది రెట్లు పెరిగి రూ.2000 అయ్యింది.
రూ.500 పెన్షన్ ఆరు రెట్లు పెరిగి.. రూ.3వేలు అయ్యింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. ఆ నాడు ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ.800కోట్లు ఖర్చు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వంలో రూ.10వేలకోట్లకుపైగా ఖర్చు పెడుతున్నం. మరో మూడు నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. ఈ ప్రభుత్వం ఉన్న పేదవారి కోసం. మీ మొఖంలో చిరునవ్వు చూడడమే మా లక్ష్యం.
మూసాపేట, అల్లాపూర్, ఓల్డ్ బోయినపల్లి, ఫతేనగర్ కావచ్చు.. మరే డివిజనే కావచ్చు.. మీ కార్పొరేటరే.. మీ బస్తీకే, మీ వద్దకు వచ్చి మీ చేతిలో పెన్షన్ పెట్టించే బాధ్యత, తొందరలో అప్పజెప్పే బాధ్యత నాది. గత రెండు సంవత్సరాలుగా కరోనాతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో కొత్త రేషన్ కార్డుల జారీలో కొంత ఆలస్యమైంది. కొత్త రేషన్‌కార్డులు, కొత్త పెన్షన్లు ఇస్తాం. అలాగే డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తాం. ఇవాళైనా, రేపైనా జీహెచ్‌ఎంసీ మేయర్, అధికారులతో సమావేశమై కార్యక్రమాన్ని మొదలు పెడుతాం. పారదర్శకంగా లాటరీ తీసి ఇండ్లు అందజేస్తాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు అనే కార్యక్రమం లేదు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ లేదు. హైదరాబాద్‌లో కట్టిన ఇండ్లు రూ.30 నుంచి రూ.50లక్షల విలువ ఉంటుంది. అలాంటి ఇండ్లు ఉచితంగా ఇచ్చే సమయంలో ఆలోచించి పారదర్శకంగా జాగ్రత్తగా అర్హులకు అందజేస్తాం’ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.