Kalvakuntla Kavitha | File Image

Hyderabad, March 12: ఢిల్లీ మద్యం కుంభకోణంలో(Delhi Liquor Scam) కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)  ఢిల్లీ నుంచి నిన్న రాత్రి హైదరాబాద్ (Delhi to Hyderabad) చేరుకున్నారు. నేడు ప్రగతి భవన్‎కు వెళ్లి సీఎం కేసీఆర్‎ను(CM KCR) కలవనున్నట్లు సమాచారం. ఈడీ విచారణ వివరాలను కేసీఆర్‎తో చర్చించే అవకాశం ఉంది. అయితే విచారణ ఇంతటితో ముగియలేదని, 16న మరోసారి హాజరు కావాలని ఈడీ అధికారులు కవితకు సూచించారు. మరోసారి హాజరు కావాల్సి ఉండడంతో ఇంకా కొంత ఆందోళనతో ఉంది.

బాలీవుడ్ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ మాతృమూర్తి స్నేహలత కన్నుమూత

విచారణ నుంచి బయటికి వచ్చిన కవిత ఉత్సాహంగానే కనిపించారు. కార్యాలయం లోపలికి వెళ్లేటప్పుడు చేసినట్లుగానే.. బయటికి వచ్చినప్పుడు కూడా కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బీఆర్‌ఎస్‌, భారత్‌ జాగృతి కార్యకర్తల నిరసనల నడుమ హాజరైన కవితను ఈడీ అధికారులు దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. రాత్రి 8 గంటల వరకు విచారించిన ఈడీ అధికారులు.. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసిందే.

మళ్లీ మొదలైన ఆందోళన.. పెరుగుతున్న కొవిడ్, హెచ్3ఎన్2 కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. మెడికల్ ఆక్సిజన్, టీకాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచన