Hyderabad, April, 02: రాజ్ భవన్ లో ఉగాది వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ను(CM KCR) ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ (Tamilisai soundarrajan)పరోక్షంగా హాట్ కామెంట్స్ చేశారు (Tamilisai comments on KCR). రాజ్ భవన్ లిమిటేషన్స్ ఏంటో తనకు తెలుసు అన్న గవర్నర్.. (Governor) ఉత్ప్రేరకంగా పని చేస్తాను అని చెప్పారు. తను స్ట్రాంగ్ పర్సన్ అని, ఎవరికీ లొంగేదీ లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు తనకు ఇగో, భేషజాలు లేవని స్పష్టం చేశారు.ఫ్రెండ్లీ గవర్నర్ రాజ్ భవన్ లో (Raj bhavan) ఉన్నారని ఆమె కామెంట్ చేశారు. ఒకరినొకరు గౌరవించుకోవాలన్న గవర్నర్ తమిళిసై అందరూ ఆపాయ్యంగా ఉండాలని సూచించారు. దేన్నైనా ప్రేమతో, అప్యాయతతో సాధించాలన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేద్దామని, రేపటి నుంచి తెలంగాణలో కొత్త చరిత్రను సృష్టిద్దామని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. వచ్చే నెల నుంచి రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు.

రాజ్ భవన్ లో ఉగాది వేడుకులకు (Rajbhavan Ugaadi Celebrations) సీఎం కేసీఆర్ గైర్హాజరు కావడం చర్చకు దారితీసింది. దీనిపై గవర్నర్ తమిళిసై పరోక్షంగా స్పందించారు. నా ఆహ్వానాన్ని గౌరవించనందుకు నేను బాధపడడం లేదన్నారు గవర్నర్ తమిళిసై (Tamilisai). 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించానని, కొందరు వచ్చారని, రాని వారి గురుంచి నేను చెప్పేదేమీ లేదన్నారామె. నన్ను ప్రగతి భవన్ లో ఉగాది కార్యక్రమానికి ఆహ్వానించి ఉంటే ప్రోటోకాల్ ని పక్కన పెట్టి హాజరయ్యే దాన్ని అని చెప్పారు. యాదాద్రికి (Yadadri)నన్ను ఆహ్వానించ లేదు, కానీ నాకు వెళ్లాలని ఉందన్నారు.నేను వివాదాస్పదం చేసే వ్యక్తిని కాదని, గ్యాప్ ని సృష్టించే వ్యక్తిని అంతకన్నా కాదన్నారు. కొన్ని అంశాలపై విభేదాలు ఉన్నాయని చెప్పారు. నేను ఎన్నిసార్లు ఆహ్వానాలు పంపినా పట్టించుకోవడం లేదని, ఇగ్నోర్ చేశారని గవర్నర్ అన్నారు. ముఖ్యమంత్రి(CM), మంత్రులు(Ministers), ఎమ్మెలేలు, ఎంపీలు అందరినీ పిలిచాము, కానీ రాలేదన్నారు. ఎవరో పిలుస్తారు అని ఎదురుచూడకుండా సమ్మక్క సారలమ్మ జాతరకు నేను వెళ్లాను అని గవర్నత్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజభవన్ కు మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటో తనకు తెలియదన్నారామె.

కాగా, తెలంగాణ రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు హాజరుకాకపోడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజ్ భవన్ లో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళిసై ఆహ్వానం పంపినా ఆయన హాజరుకాలేదు. మరోవైపు ఉగాది ఉత్సవాల ఫ్లెక్సీపై రాష్ట్రపతి, ప్రధాని, గర్నవర్ ఫొటోలు ఉండగా.. సీఎం కేసీఆర్ ఫొటో కనిపించకపోవడంపై చర్చ జరుగుతోంది.

Telangana Governor Tamilisai: నన్ను ఎవరూ భయపెట్టలేరు, నేను దేనికి భయపడను, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు

అసలే కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మధ్య పలు అంశాలకు సంబంధించి మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ధాన్యం దంగల్ నడుస్తోంది. తెలంగాణ పండించిన ప్రతి గింజను కేంద్రం కొని తీరాల్సిందేనని సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కేంద్రం వర్సెస టీఆర్ఎస్ గా మారింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. బీజేపీ రైతు ద్రోహి అని టీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించింది. కేసీఆర్ మాట మార్చారని బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో రాజ్ భవన్ లో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.