KCR Review Meet: కొత్త సచివాలయంలో తొలిసారి కలెక్టర్లలో సదస్సు, దశాబ్ది ఉత్సవాలు సహా పలు కీలక అంశాలపై దిశానిర్ధేశం   చేయనున్న ముఖ్యమంత్రి
KCR (Credits: T News)

Hyderabad, May 25: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ఆధ్వర్యంలో గురువారం సచివాయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయం ఆరవ అంతస్థులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్‌ కమిషనర్లు పాల్గొననున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం ( Review Meet) చేయనున్నారు. సమావేశంలో పాల్గొనాల్సిందిగా అన్ని శాఖల మంత్రులతోపాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని ఆహ్వానించారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

TS Eamcet Results: మరికాసేపట్లో తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ విడుదల, ఫలితాలను ఎక్కడ చూసుకోవచ్చంటే! 

నూతన సచివాలయం ప్రారంభమైన తర్వాత సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే. ముందుగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ భావించినా, ఆ తర్వాత నేరుగా సమావేశమై దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు.