Khammam Shocker: వివాహేతర సంబంధం మోజులో భర్త ఇల్లు గుల్ల చేసిన భార్య, రూ.63 లక్షల విలువైన బంగారం తీసుకుని ప్రియుడితో జంప్, ఇంట్లో చోరీ జరిగిందని భర్త ఫిర్యాదు, నిందితులిద్దర్నీ అరెస్ట్ చేసిన ఖమ్మం పోలీసులు
ఖమ్మం జిల్లాలో ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను మోసం చేసిందో భార్య. భర్త ఇంట్లోని బంగారు, వెండి నగలను తస్కరించి ప్రియుడికి అప్పజెప్పింది. వాటిని నగదుగా మా ర్చేందుకు ప్రయత్నించి చివరకు కట కటాల పాలైంది.
Khammam, May 25: ఖమ్మం జిల్లాలో ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను మోసం చేసిందో భార్య. భర్త ఇంట్లోని బంగారు, వెండి నగలను తస్కరించి ప్రియుడికి అప్పజెప్పింది. వాటిని నగదుగా మా ర్చేందుకు ప్రయత్నించి చివరకు కట కటాల పాలైంది. పోలీస్ కమి షనర్ విష్ణు వారియర్ తెలిపిన వివరాల ప్రకారం కారేపల్లికి చెందిన తాకట్టు వ్యాపారి శివ ప్రకాష్‌దారక్, అర్చన దంప తులు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు తలెత్తడంతో అర్చన ఏపీలోని గుంటూరులో తన పుట్టింటికి వెళ్లింది.
అక్కడ వెంకట కృష్ణ్ణప్రసాద్‌తో వివాహేతర సంబంధం (Extramarital Affair) పెట్టు కుంది. ఇటీవల తన అత్త మృతి చెందడంతో కారేపల్లికి తిరిగి వచ్చింది. ప్రియుడితో కలసి జీవించాలనుకున్న ఆమె.. ఇంట్లో ఉన్న నగల ను తస్కరించాలని (Wife Cheated Her Husband) నిర్ణయించుకుంది. ఈనెల 3న ప్రియుడిని కారేపల్లికి పిలిపించుకుంది. లాకర్‌లో ఉన్న ఆభరణాలను అపహరించింది. వాటిని ప్రియుడు కృష్ణ ప్రసాద్‌కు ఇచ్చి నగదు గా మార్చాలని, తర్వాత తాను వస్తానని చెప్పి పంపించేసింది.
కాగా, ఇంట్లో చోరీ జరిగిందని భర్త శివప్రకాష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే.. పోలీసులు అర్చనను తమదైన శైలిలో విచారించగా.. ప్రియుడితో కలసి తానే నగల ను అపహరించినట్లు అం గీకరించింది. దీంతో వారిద్దరిని అరెస్టు చేశారు. రూ.63 లక్షల విలువ గల బంగారు ఆభరణాలను స్వాధీనపర్చుకున్నారు.
(The above story first appeared on LatestLY on May 25, 2021 02:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

