Telangana Shocker: పెళ్లి వద్దంటావా..బీరు బాటిల్‌తో ప్రేయసిని పొడిచి చంపేసిన ప్రియుడు, నల్గొండ జిల్లాలో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Hyderabad, May 22: తెలంగాణలోని నల్గొండ జిల్లాలోప్రేమోన్మాది మద్యం మత్తులో చెలరేగిపోయాడు. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని అతి దారుణంగా హతమర్చాడు. ఈఘటన నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ శివం హోటల్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ప్రియురాలు చందనను శంకర్ బీరు సీసాతో పొడిచి (boyfriend killed his girlfriend with a beer bottle) చంపేశాడు. చందన పెళ్లికి నిరాకరించడంతోనే (refusing to marry) శంకర్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన వెలుగు అంజయ్య, రాములమ్మ దంపతుల చిన్న కుమార్తె చందన (20) ఇంటర్‌ దాకా చదివి కూలి పనులకు వెళుతోంది. అనుముల మండలం కొరివేనిగూడేనికి చెందిన బొడ్డు శంకర్‌ ఇంటర్‌ చదివి వరికోత మిషన్‌ నడుపుతున్నాడు. 45 రోజుల క్రితం గుర్రంపోడు మండలంలో వరికోతలకు శంకర్‌ బొల్లారం వెళ్లాడు.

వృద్ధురాలిని చంపేసి ఆపై శవంతో అత్యాచారం, ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, జువైనల్‌ కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపిన డీఎస్పీ ప్రసాద్‌

ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. రోజూ కలుసుకునేవారు. ఇద్దరూ పెళ్లి గురించి మాట్లాడుకునేందుకు శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై సాగర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో హిల్‌కాలనీ రెండో డౌన్‌ వద్ద శివం హోటల్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వెంట తెచ్చుకున్న మద్యాన్ని శంకర్‌ తాగాడు. అనంతరం ఇద్దరూ కలిసి భోజనం చేశారు. శంకర్‌ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా చందన నిరాకరించింది.

ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అక్కడే ఉన్న ఖాళీ బీరు బాటిల్‌ను పగలగొట్టి చందన గొంతులో పొడిచి, బండరాయితో తలపై మోదడంతో ఆమె మృతి చెందింది. మద్యం మత్తులో ఉన్న శంకర్‌ అక్కడే చెట్టుకింద నిద్రించి, సాయంత్రం నిద్రలేచి ప్రధాన రహదారిపైకి చేరుకున్నాడు. అటుగా వెళుతున్న పోలీసులు గమనించి ప్రశ్నించడంతో హత్య చేసిన విషయం వారికి చెప్పాడు.

పెళ్లి చేసుకుంటానంటూ మహిళా డాక్టర్‌పై అదేపనిగా అత్యాచారం, తరువాత అశ్లీల ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులు, నాగ్‌పూర్‌లో ఐటీ కమిషనర్‌ దారుణం, ఐపీసీ సెక్షన్‌ 376 (2) కింద నిందితుడిపై కేసు నమోదు

వెంటనే ఎస్‌ఐకి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని చందన మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించి శంకర్‌ను స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ పేర్కొన్నారు.