Hyderabad, Aug 24: బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) మరికొద్దిసేపట్లో తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Women’s Commission) ముందు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్ ను కమిషన్ విచారించనుంది. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు ఆయన వివరణ ఇవ్వనున్నారు.
కాసేపట్లో రాష్ట్ర మహిళా కమిషన్కు కేటీఆర్
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు.
కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్.
వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కేటీఆర్కు నోటీసులు జారీ.
ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ కార్యాలయానికి… pic.twitter.com/CRaOWZhoT2
— BIG TV Breaking News (@bigtvtelugu) August 24, 2024
అసలేం జరిగిందంటే?
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఈ నెల 15వ తేదీన కేటీఆర్ చేసిన కామెంట్స్ పై వివాదం రాజుకుంది. బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్, రికార్డింగ్ డాన్సులు చేసినా తాము ఏమంటామని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల గురించి వివాదాస్పద కామెంట్స్ చేశారని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ నేడు హాజరు కావాలని కేటీఆర్ కు నోటీస్ ఇచ్చింది.