Telangana Assembly (PIC@Wikimedia commons)

Hyderabad, SEP 08: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు (Alliance With Congress) కామ్రేడ్లు కసరత్తు చేస్తున్నారు. హస్తం పార్టీతో ఫస్ట్ సీట్ల విషయం తేల్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సీపీఐ (CPI) నేత నారాయణ సమావేశమై చర్చించగా, సీపీఎం హుటాహుటినా ఆన్ లైన్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. సీపీఎం (CPM) కేంద్ర నాయకత్వం ఆదేశాలతో సీపీఎం రాష్ట్ర నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. తాము కోరిన సీట్లు ఇస్తేనే హస్తం పార్టీతో పొత్తుకు వెళ్లాలని సీపీఎం అభిప్రాయపడుతోంది. తమకు ఎన్ని సీట్లు ఇస్తారో కాంగ్రెస్ క్లారిటీ ఇస్తేనే పొత్తుకు సై అనాలని భావిస్తోంది. కాంగ్రెస్ తో పొత్తులు (Alliance With Congress), సీపీఐ, సీపీఎంకు ఇచ్చే సీట్లు, పోటీ చేయాల్సిన స్థానాలపై నేతలు చర్చించారు. సీపీఎంకి ఎన్ని సీట్లు ఇస్తారో క్లారిటీ ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ తో పొత్తులపై మాట్లాడుతామని సీపీఎం రాష్ట్ర నేతలు చెప్పారు.

TRT Notification: తెలంగాణలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, మొత్తం 5089 పోస్టుల భర్తీకి ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు, ఎలా అప్లై చేసుకోవాలంటే? 

అయితే సీపీఎం ఐదు సీట్లు డిమాండ్ చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు, మధిర, భద్రాచలం నియోజకవర్గాలు, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం సీట్లను డిమాండ్ చేయాలని నిర్ణయించింది. గతంలో కూడా ఇవే సీట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ను సీపీఎం నేతలు కోరారు. లేకపోతే సీపీఐ, సీపీఎం గా కలిసి తాము బలంగా ఉన్న 32 సీట్లలో కలిసి పోటీ చేస్తామని పేర్కొన్నారు.

Chandrababu on CM Jagan Birth: జగన్ పుట్టుకే తప్పుడు పుట్టుక అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు, రాయదుర్గం వేదికగా విరుచుకుపడిన టీడీపీ అధినేత వీడియో ఇదిగో.. 

సీపీఐ కూడా తమకు ఐదు సీట్లలో పోటీ చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ను కోరుతోంది. ఈ మేరకు సీపీఐ తాము పోటీ చేయనున్న కాంగ్రెస్ నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హుస్నాబాద్, కొత్తగూడెం, బెల్లంపల్లి, మునుగోడు, వైరా స్థానాలను కోరుతోంది. సీపీఐ, సీపీఎం చెరో ఐదు స్థానాలను కోరుతున్నాయి. పది చోట్ల పోటీకి సై అంటున్నాయి. తాము అడిగిన పది సీట్లతో పోటీకి అవకాశం ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టులు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని చెబుతున్నాయి. లేకుంటే సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా పోటీకి దిగాలని భావిస్తున్నాయి.