Local Body MLC Elections 2021: ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, ఇప్పటికే ఎమ్మెల్యే కోటా లో ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
Kalvakuntla Kavitha | File Image

Hyd, Nov 24: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట కవిత (kalvakuntla kavitha ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ తిరస్కరించడంతో కవిత ఎన్నిక ఏకగ్రీవమైంది. కాగా నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ పంచాయతీరాజ్‌ చాంబర్‌ తరఫున ఆర్మూర్‌ నియోజకవర్గం మాక్లూర్‌ మండలం అమ్రాద్‌ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే స్వతంత్ర అభ్యర్థిపై ఫోర్జరీ ఆరోపణలు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అంతకుముందు నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్‌ను బలపరుస్తూ తాము సంతకాలు చేయలేదంటున్నారు ఎంపీటీసీ, కార్పొరేటర్‌. అంతేకాదు తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆరోపిస్తున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి వీరు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, చిక్కడపల్లి సీఐ, ఎస్ఐతో పాటు సీసీఎస్‌ ఎస్ఐ సస్పెండ్, ఉత్తర్వులు జారీ చేసిన సీపీ అంజనీకుమార్

ఇటీవల రాజ్యసభ సభ్యుడు Banda Prakash ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయడంతో... ఆయన స్థానంలో కవితను పంపిస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే నిజామాబాద్ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు వినిపించింది. కానీ, టిఆర్ఎస్ అధిష్టానం ఊహాగానాలకు తెరదించుతూ నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరునే ఖరారు చేసింది.

వరంగల్ స్థానం నుంచి పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం నుంచి తాత మధుసూదన్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 26 వరకు ఉపసంహరణ అవకాశం ఉంది. డిసెంబర్ 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ఎమ్మెల్యే కోటా లో ఆరుగురు ఎమ్మెల్సీలు ( కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, రవీందర్, కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి ) ఏకగ్రీవం అయ్యారు. నామినేషన్ల గడువు పూర్తికావడంతో ఆరుగురి ఎన్నిక ఏకగ్రీవం అయిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సభ్యులకు సర్టిఫికెట్లు కూడా జారీ చేసింది. వీరంతా సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు.