Hyderabad, March 12: సినీ గేయ రచయిత (Lyricist) కందికొండ(49) (Kandikonda) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు. వెంగళరావు నగర్‌లోని తన ఇంట్లో కందికొండ తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. వరంగల్‌ జిల్లా (Warangal) నర్సంపేట (Narsampet) మండలం నాగుర్లపల్లిలో కందికొండ జన్మించారు. ఓయూలో (OU) ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం, రచనలపై తనకున్న ఆసక్తి కారణంగా క్రమంగా సినీ రంగంవైపు అడుగులు చేశారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’(Itlu Sravani Subramanyam) చిత్రంలో ‘మళ్లీకూయవే గువ్వ’ (Mallikooyave guvva) పాటతో ఆయన గేయ రచయితగా (Lyricist) మారారు. మంచి మెలోడీ గీతంగా ఆ పాట శ్రోతలను విశేషంగా అలరించింది. దీంతో చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు తలుపుతట్టాయి.

SS Rajamouli: సీఎం జగన్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన రాజమౌళి, సినిమా ప‌రిశ్ర‌మ పునరుద్ధరణకు ఈ నిర్ణ‌యం తోడ్ప‌డుతుంద‌ని ఆశిస్తున్నామంటూ ట్వీట్

అలా ‘ఇడియట్‌’లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘ఐయామ్‌ ఇన్‌ లవ్‌’, ‘పోకిరి’లో ‘గల గల పారుతున్న గోదారిలా’(Gala Gala Paaruthunna Godarila) ‘జగడమే’, ‘లవ్‌లీ’లో ‘లవ్‌లీ లవ్‌లీ’ తదితర పాటలు రాశారు. చివరిగా 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు.  గొంతు క్యాన్సర్ కారణంగా ఆయన ఆస్పత్రి పాలయ్యారు. అదే సమయంలో కీమోథెరపీ కారణంగా కందికొండ వెన్నెముక దెబ్బతింది. దీంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అదే సమయంలో కరోనా విజృంభించడంతో వారి పరిస్థితి మరింత దిగజారింది.

ఈ క్రమంలో కందికొండ కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మంత్రి కేటీఆర్‌ (KTR) ఆదేశాల మేరకు కందికొండకు చికిత్స అందించారు. కొన్ని రోజులు ఆరోగ్యం నిలకడగా ఉన్నా, మళ్లీ క్షీణించడంతో శనివారం కందికొండకు తుదిశ్వాస విడిచారు.  ఆయన చాలా రోజులుగా మంచానికే పరిమితమయ్యారు. ఆయన్ను రక్షించుకునేందుకు సినీ రంగంలోకి చాలా మంది విరాళాలు వేసుకొని ప్రయత్నించారు. కానీ చివరికి చావుతో పోరాడి కన్నుమూశారు.

కందికొండ మృతి పట్ల చిత్ర పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఒక మంచి గేయ రచయితను కోల్పోయామని సినీ పరిశ్రమకు చెందిన పలువురు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పల్లెటూరు నుంచి వచ్చి సినీ గేయరచయితగా ఆయన ప్రస్థానం అద్వితీయమని కొనియాడుతున్నారు.