Maharashtra Encounter: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఎన్‌కౌంటర్, నలుగురు మావోయిస్ట్‌ అగ్రనేతలు మృతి, కొనసాగుతున్న కూంబింగ్‌ ఆపరేషన్
Representative Image of Security Forces (Credits: X/@Shadowfox_11)

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మంగళవారం(మార్చి 19) తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డప్పుడు కాల్పులు ‍ జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్ట్‌ అగ్రనేతలు మృతి చెందారు. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్‌ కొనసాగుతోంది. వన్యప్రాణులతో సెల్ఫీ దిగారో.. ఇక ఏడేండ్లు జైలుకే.. ఎందుకు? అసలు ఎక్కడ ఉంది ఈ రూల్??

మృతి చెందిన వారిలో మంచిర్యాల డివిజన్‌ కమిటీ సెక్రటరీ వర్గీస్‌, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, కుర్సంగ్‌ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌ ఉన్నారు. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టులపై రూ. 36 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.