Rains (File: Twitter)

Hyderabad, Dec 12: మాండూస్ తుపాను (Mandous Cyclone) ప్రభావం హైదరాబాద్‌పైనా (Hyderabad) పడింది. శీతల గాలులు (Coldwaves) వీస్తుండంతోపాటు ముసురు వాతావరణం నెలకొనడంతో చలితో (Cold) జనం అల్లాడుతున్నారు. చలిగాలులు తీవ్రంగా ఉండడంతో చిన్నారులు (Children), పెద్దలు (Oldage People) ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీనికితోడు గత అర్ధరాత్రి కురిసిన వర్షం పరిస్థితిని మరింత దిగజార్చింది.

రేపు మరో అల్పపీడనం.. ఏపీలో నేడు కూడా వర్షాలు.. తెలంగాణలోనూ రెండు రోజులు మోస్తరు వర్షాలు

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, నారాయణగూడ, హయత్ నగర్, సరూర్ నగర్ సహా దాదాపు నగరమంతా ఈ ఉదయం నుంచి వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడుతోంది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.