TSRTC MD Sajjanar (photo-Video Grab)

Medaram, Feb 20: ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఉత్సవంగా నిర్వహించే మేగారం జాతర రేపటి నుండి మొదలై( ఫిబ్రవరి 21) నాలుగు రోజుల పాటు సాగి 24వ తేదితో ముగుస్తుంది. తెలంగాణ కుంభమేళాగా భావించే మేడారం జాతరకు (Medaram Jathara 2024) ప్రతి ఏడాది సుమారు కోటికిపైగా భక్తులు వచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరుగుతుంది.

2024 ఫిబ్రవరి 21న జాతర మొదలుకానుంది. జాతరకు ఒకరోజు ముందే పగిడిద్దరాజును మేడారంకు (Medaram Jathara ) తీసుకువస్తారు. అనంతరం సారలమ్మ, గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 22న సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 23న భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఫిబ్రవరి 24న దేవతల వనప్రవేశం ఉండగా... ఫిబ్రవరి 28వ జాతర పూజలు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి.

మేడారానికి హెలికాప్టర్‌ లో వెళ్లొచ్చు.. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు .. త్వరలో ధరల వెల్లడి

ఒక మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను దాదాపుగా తరలించిన నేపథ్యంలో.. ప్రయాణికులు ఇబ్బందులు (inconvenience of RTC passengers) పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (TSRTC Managing Director Sajjanar) విజ్ఞప్తి చేశారు. జాతర పూర్తయ్యే వరకు ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనసుతో సహకరించాలని కోరారు. తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను TSRTC నడుపుతోంది.

Here's Sajjanar Tweets

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. రెగ్యులర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Here's Videos

మేడారం వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు అవకాశం లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. మూగజీవాలకు ఆర్టీసీ బస్సుల్లో ఎంట్రీ లేదన్నారు. అంతేకాదు.. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని మేడారంలో 15 కిలో మీటర్ల మేర 48 క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం జాతరలో 15వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని సూచించారు.