Hyderabad, March 20: ‘మిల్లెట్ మ్యాన్’గా (Millet Man) ప్రపంచ దేశాలకు సుపరిచిరపరిచితమైన పీవీ సతీశ్ (77) (PV Sathish) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన సతీశ్.. 20 సంవత్సరాలపాటు దూరదర్శన్‌లో కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడిగా పనిచేశారు. 1970లో నాసా, ఇస్రో కలిసి నిర్వహించిన ‘శాటిలైట్ ఇన్‌స్ట్రక్షనల్ టెలివిజన్’ (సైట్) ప్రయోగంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కొందరు మిత్రులతో కలిసి 1985లో జహీరాబాద్ సమీపంలోని పస్తాపూర్‌లో (Pastapur village) డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) (Deccan Development Society) స్థాపించారు. అక్కడ బడుగు వ్యవసాయ, రైతు కూలీ మహిళలను ప్రకృతి సేద్యం దిశగా ప్రోత్సహించారు. 75 గ్రామాల్లోని దాదాపు 5 వేల మందికిపైగా డీడీఎస్‌లో సభ్యులుగా ఉన్నారు.
'Millet Man' PV Satheesh Dies At 77 After Prolonged Illness https://t.co/MBM5Tf9J93 pic.twitter.com/nObpGxwZBC
— NDTV News feed (@ndtvfeed) March 19, 2023
అంతర్జాతీయ స్థాయిలో చిరుధాన్యాలకు గుర్తింపు తీసుకురావడంలో సతీష్ ఎంతో కృషిచేశారు. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషికి గాను 2019లో ఐరాస డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఈక్వేటర్ ప్రైజ్, ప్రిన్స్ ఆల్బర్ట్- మొనాకో ఫౌండేషన్ అవార్డు వంటి అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. సతీశ్ అంత్యక్రియలు నేటి ఉదయం 11 గంటలకు పస్తాపూర్‌లో జరగనున్నాయి.