తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఆయనకు లాస్ ఏంజెల్స్ లో ఘన స్వాగతం లభించింది. పార్టీ అభిమానులు, ఎన్ఆర్ఐలు కేటీఆర్ కు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలతో మంత్రి కేటీఆర్ కాసేపు సమావేశమయ్యారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలుకరించారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లారు. పది రోజుల పాటు ఆయన అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. తెలంగాణలో అమలు పరుస్తున్న మన ఊరు - మన బడి కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు సహకరించాలని కేటీఆర్ కోరారు.
తెలంగాణ (Telangana) రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు (Investments) తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కే. తారకరామారావు (Minister KTR) కి అమెరికా (America)లోని లాస్ ఏంజిల్స్ నగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు (TRS leaders) మరియు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం తెలిపారు. ఎయిర్పోర్టులో (Airport) మంత్రి కేటీఆర్ కి పూల బొకేలు అందించి స్వాగతం (Welcomed) తెలిపారు.
మంత్రి కే తారకరామారావు లాస్ ఏంజిల్స్ (Los Angeles)లో తనకు స్వాగతం పలికిన ఎన్నారైలతో తర్వాత కాసేపు ముచ్చటించారు (Chit chat with NRI). ఈ సందర్భంగా తెలంగాణ (Telangana ) అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల పైన ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ మన ఊరు మన బడి (Our Village our school) కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని (wants to participate)మంత్రి కేటీఆర్ కోరారు. అమెరికా లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా (As ambassadors) వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.