Minister Ponguleti Srinivas Reddy about Local Body Elections(X)

Khammam, FEB 02: పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15 తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) వస్తుందన్నారు. నాయకులంతా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించొద్దని హితవు పలికారు మంత్రి పొంగులేటి. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్నారు. ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో పర్యటించిన సందర్భంగా మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు.

Temperatures Increase In Telangana: ఎండాకాలం వచ్చేసినట్లేనా? తెలంగాణలో గణనీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, పలు జిల్లాల్లో గతం కంటే 6 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదు  

పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమగ్ర కుటుంబ సర్వేపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల (Pachayat Elections) అంశం కూడా చర్చకు వచ్చింది. ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామంటూ పంచాయతీరాజ్, ఎన్నికల సంఘం అధికారులు తెలిపినట్లు సమాచారం. కులగణన నివేదిక కేబినెట్‌ సబ్‌కమిటీకి ఆదివారం అందింది. దీనిపై కేబినెట్‌లో చర్చించాక.. 4న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి... కేంద్ర ప్రభుత్వానికి పంపించే వీలుంది. కేంద్రం స్పందన ఎలా ఉన్నా... రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు వెళ్లాలనే కార్యాచరణతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.